India Passport Index: శక్తిమంతమైన భారతీయ పాస్‌పోర్టు.. ఇండియన్స్‌కు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:36 PM
శక్తిమంతమైన పాస్‌పార్టుల జాబితాలో భారత్ ఈసారి 77వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 59 దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఇస్తుండటంతో భారత పాస్‌పోర్టు ర్యాంకు గతంలో కంటే మెరుగుపడింది. మరి ఏయే దేశాలు భారత్‌కు ఈ అవకాశం ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితా హెన్లీ పాస్‌పోర్డు ఇండెక్స్‌లో భారత్ ఈమారు 77వ స్థానం సాధించింది. ఈ జాబితాలో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్ వాసులకు ఏకంగా 193 దేశాల్లో వీసా రహిత ఎంట్రీకి అవకాశం ఉంది. ఆ తరువాతి స్థానాల్లో జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ రెండు దేశాల వారికీ 190 దేశాల్లో వీసా రహిత ఎంట్రీకి అనుమతి ఉంది. ఈసారి మరో రెండు దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించడంతో భారత్ ర్యాంకు మెరుగుపడింది. ప్రస్తుతం 59 దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు.
అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స, బురుండి, కాంబోడియా, కేప్ వెర్డె దీవులు, కోమరో దీవులు, కుక్ దీవులు, జిబౌటి, డోమినికా, ఇథియోపియా, ఫిజీ, గ్రెనెడా, గినియా-బిసౌ, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజఖ్‌స్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావ్ (ఎస్ఏఆర్ చైనా), మెడగాస్కర్, మలేషియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మారిషస్, మైక్రోనేషియా, మంగోలియా, మాంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నమీబియా, నేపాల్, నియూ, పాలౌ దీవులు, ఫిలిప్పీన్స్, ఖతర్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్, టాంజానియా, థాయ్‌లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, తిమోర్-లెస్తే, టువాలు, వనౌటు, జింబాబ్వే దేశాలకు భారతీయులు వీసా లేకపోయినా వెళ్లొచ్చు.
సింగపూర్, జపాన్, దక్షిణకొరియా తరువాతి స్థానాల్లో డెన్మార్క్, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇర్లాండ్ ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రియా, బెల్జియం, లగ్జెంబర్గ్ తదితర దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు టాప్‌లో నిలిచిన అమెరికా, యూకే దేశాల పాస్‌పార్టు ర్యాంకులు ఇటీవల కాలంలో తగ్గుతూనే ఉన్నాయి. 186 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్న బ్రిటన్ 6వ ర్యాంకు, అమెరికా (182 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ) 10వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
వైభవంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం
ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు