OPT: అమెరికాలో ఫారిన్ స్టూడెంట్స్‌కు అత్యధికంగా జాబ్స్ ఇచ్చిన కంపెనీలు ఇవే
ABN , Publish Date - Jun 14 , 2025 | 09:09 PM
అమెరికాలో ఫారిన్ విద్యార్థులకు అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన సంస్థగా అమెజాన్ టాప్‌లో నిలిచింది.

ఇంటర్నెట్ డెస్క్: పైచదువులు, అంతర్జాతీయ స్థాయి వృత్తి నైపుణ్యాలు సాధించాలనే ఏ విద్యార్థి అయినా అమెరికాకు క్యూ కడతారు. ఇందుకు తగట్టే, అమెరికాలో చదువుకునే విద్యార్థులకు తమ రంగంలో వృత్తి నైపుణ్యాలు సాధించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఓపీటీ, సీపీటీ ద్వారా విద్యార్థులు పని అనుభవం సాధించొచ్చు.
ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులకు అత్యధికంగా జాబ్స్ ఇచ్చిన అమెరికన్ కంపెనీగా అమెజాన్ తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ప్రీ, పోస్టు కంప్లీషన్ ఓపీటీ కింద 5,379 ఫారిన్ స్టూడెంట్స్‌కు అమెజాన్‌లో జాబ్‌లు దక్కాయి. ఇక టెస్లాలో 1170 మందికి, యాపిల్‌లో 1135 మందికి, గూగుల్‌లో 1110 మందికి జాబ్స్ అభించాయి.
విదేశీ విద్యార్థులకు అవకాశాలు ఇచ్చిన టాప్ కంపెనీలు
అమెజాన్ – 5,379 ఉద్యోగాలు
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం – 2,112
అరిజోనా స్టేట్ యూనివర్సిటీ – 1,895
టెక్సాస్ విశ్వవిద్యాలయం – 1,305
బ్రైట్ మైండ్ ఎన్‌రిచ్‌మెంట్ అండ్ స్కూలింగ్ – 1,234 ఉద్యోగాలు
టెస్లా – 1,170 ఉద్యోగాలు
గోల్డ్‌మన్ సాక్స్ – 1,148 ఉద్యోగాలు
ఆపిల్ – 1,135
గూగుల్ – 1,110
మెటా – 1,081 ఉద్యోగాలు
మైక్రోసాఫ్ట్ – 1,066
బైట్‌డాన్స్ – 1,045
డెలాయిట్ – 1,033
వాల్‌మార్ట్ – 951
ఇంటెల్ – 946
స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ – 906
ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ – 889 ఉద్యోగాలు
జాన్స్ హాప్కిన్స్ – 827
హార్వర్డ్ – 799
కమ్యూనిటీ డ్రీమ్స్ ఫౌండేషన్ – 795
మిచిగాన్ విశ్వవిద్యాలయం – 767 ఉద్యోగాలు
దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం – 717
ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం – 714
మెకింజీ అండ్ కంపెనీ – 680
జేపీ మోర్గాన్ చేజ్ – 675 ఉద్యోగాలు
గతేడాది 194,554 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ ద్వారా జాబ్స్ పొందారు. మరో 95,384 మందికి స్టెమ్ ఓపీటీ ద్వారా జాబ్స్ దక్కాయి. ఇక 130,586 మంది ఫారిన్ విద్యార్థులు సీపీటీ ద్వారా వర్క్ ఆథొరైజేషన్ పొందారు. 2023తో పోలిస్తే ఓపీటీ విద్యార్థుల సంఖ్య 21 శాతం పెరిగింది. స్టెమ్ ఓపీటీలో 54 శాతం వృద్ధి కనిపించింది. అయితే, సీపీటీలో మాత్రం 0.4 తగ్గుదల కనిపించింది.
ఇవి కూడా చదవండి
హెచ్-1బీ వీసా వివాదం.. అమెరికా కంపెనీపై జరిమానా
డిపోర్టు చేస్తుండగా తప్పించుకున్న భారతీయుడు.. టార్మాక్‌పై పరుగు
Read Latest NRI News And Telugu News