Share News

TANA Farmers Program: తానా ఆధ్వర్యంలో రైతులకు 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు పంపిణీ

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:52 PM

వీరవల్లిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని తానా విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు రూ. 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు, భద్రతా కిట్లు అందజేసింది.

TANA Farmers Program: తానా ఆధ్వర్యంలో రైతులకు 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు పంపిణీ
TANA Farmers Program

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతు కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఎంతో సాయపడుతోంది. తాజాగా, వీరవల్లిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని తానా విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు రూ. 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు, భద్రతా కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంసెట్టి సుభాష్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు యర్లగడ్డ, గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడవల్లి నరసయ్య లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
1.jpg


రైతుల కోసం తానా కొనసాగిస్తున్న సంకల్ప సేవ

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, ట్రెజరర్ రాజా కసుకుర్తి నాయకత్వంలో, పురుగుమందులు తగ్గించడానికి ఉపయోగపడే ఆధునిక పవర్ స్ప్రేయర్లు, కోత అనంతరం పంటలను వర్షం, గాలి వంటి సమస్యల నుండి రక్షించే పరజాలు పంపిణీ చేశారు. గ్రామ రైతులు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ పేద, మధ్య తరగతి రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఇవి ఎంతో ఉపయోగకరమని అభినందించారు.
2.jpg


మాతృభూమిపట్ల తానా సేవను ప్రశంసించిన ప్రజా ప్రతినిధులు

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న నాయకులు.. తానా ట్రెజరర్ రాజా కసుకుర్తితో పాటు ఇతర నాయకుల సేవాస్ఫూర్తిని అభినందించారు. భారతీయ రైతుల సంక్షేమం కోసం ప్రవాస భారతీయ సంస్థ చేస్తున్న ఈ సేవ “అమూల్యమైనది, మాతృభూమికి గొప్ప సేవ” అని పేర్కొన్నారు.
3.jpg


స్థానిక తానా వాలంటీర్, రైతు నాయకుడు శ్రీధర్ కలపాల కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రైతులు ప్రపంచాన్ని పోషించే వారు కాబట్టి, ఇలాంటి సేవలు చాలా అవసరమని తెలిపారు. గ్రామంలోని పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు అళ్ళ గోపాలకృష్ణ, బుజ్జి గుండపనేని, శ్రీనివాస్ వెములపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని తానాకు కృతజ్ఞతలు తెలిపారు.
5.jpg


ఇవి కూడా చదవండి

హీరో, టీవీకే చీఫ్ విజయ్‏కి పోలీసుల షాక్... ఆయన ప్రచారానికి..

ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్

Updated Date - Nov 21 , 2025 | 12:57 PM