Share News

Saudi Arabia: కోట్లకు పడగలెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసిన ప్రవాసీయులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:34 PM

సౌదీలో కోట్లకు పడగలెత్తిన ఇద్దరు ఎన్నారైల జీవితం విషాదంతంగా ముగిసింది. అక్రమమార్గాల్లో కోట్లు సంపాదించినా చివరకు చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి కన్నుమూశారు.

Saudi Arabia: కోట్లకు పడగలెత్తి కటిక దారిద్య్రంతో కన్నుమూసిన ప్రవాసీయులు
Saudi Arabia Migrants' Tragedy

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలకు వచ్చిన అత్యధికులు పెట్రో డాలర్ల సంపాదనతో తమ బంగారు భవిష్యత్తును తాము రచించుకోగా మరికొందరు మాత్రం దురాశకు వెళ్ళి దుఃఖాన్ని కొని తెచ్చుకున్నారు. కోట్లకు పడగలెత్తినా చివరి అంకంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా కటిక దారిద్ర్యంలో దుర్భర దుస్ధితిలో సౌదీ అరేబియాలో మరణించారు.

నోట్ల కట్టలను పెట్టే స్థలం లేక సంచులలో వేసి గోదాంలలో వేసిన హైదరాబాద్ నగరానికి చెందిన గప్ఫార్ సేట్, చేయికి తగిలింది ప్రతిదీ పసిడిగా అయిన సిద్దిపేట జిల్లాకు చెందిన గాథర మోండయ్య.. ఇద్దరు కూడా ఒకప్పుడు సౌదీలో డబ్బు సంపాదించి అలిసిపోయిన వ్యక్తులుగా ప్రసిద్ధి. డబ్బు సంపాదనతో తీరిక లేకుండా గడిపిన వీరిరువురూ కూడా దాదాపు 20 సంవత్సరాల నుండి మాతృభూమికు వెళ్ళే తీరిక లేకుండా గడిపి ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలించి తినడానికి కూడ తిండి సైతం లేక మరణించారు. మోండయ్య అయితే ఏకంగా మనీలాండరింగ్ అభియోగాలను ఎదుర్కొని స్వదేశానికి వెళ్ళలేక పోయాడు.


ప్రతి వారం కోట్ల రూపాయల చట్టవిరుద్ధమైన థాయలాండ్ లాటరీని నిర్వహించి అశేషంగా సంపాదించిన గప్ఫార్ సేట్ వెనక్కి తిరిగి చూసే తీరిక లేకుండా గడిపాడు. ఆ తర్వాత పరిస్థి తులు ప్రతికూలించి చట్టానికి చిక్కి కనీసం తన అఖమాను సైతం రెన్యువల్ చేయించుకోలేక, ఇంటి అద్దె కనీసం కరెంటు బిల్లు సైతం చెల్లించలేక ఒక పాడుబడ్డ భవంతిలో మండే ఎండల సూర్య ప్రతాపంలో గడుపుతూ అతి కష్టంగా తన భార్య, పిల్లలను కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌కు పంపించాడు. లాటరీ సంపాదన సరైంది కాదని వారిస్తూ అతని భార్య హైదరాబాద్ నుండి తన పుట్టింటి నుండి డబ్బులు తెప్పించుకోని వాటితో తాను, తన పిల్లలను పోషించుకోనేదనేది చెబుతారు. కోట్ల రూపాయాల నుండి ఒక్క రూపాయి కూడా అమె ఎప్పుడు వాడుకోలేదని చెబుతారు.


ఇక ప్రవాసం చాలు, ఏ విధంగానైనా తనను స్వదేశానికి తిరిగి పంపించాలంటూ ప్రయత్నం చేస్తూ గప్ఫార్ ఇటీవల అల్ ఖోబర్‌లో మరణించాడు. అదే విధంగా, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన గాథర మోండయ్య సంపద ఎంత అంటే ఆయన ఏకంగా మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొని స్వదేశానికి తిరిగిరాలేపోయాడు. మోండయ్య భవన నిర్మాణ కంట్రాక్టింగ్, వ్యాపారాలు, వీసా వ్యాపారం, అక్రమంగా డబ్బు పంపించడం మొదలగు అనేక పనులు చేశాడు. తీవ్రమైన మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కోవడం వలన ఎడారిలో ఆజ్ఞాత జీవితం గడపుతూ ఏకంగా 17 సంవత్సరాలు మాతృదేశానికి వెళ్ళకుండా గడుపుతూ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. అతని మృతదేహాన్ని సామాజిక సేవకుడు ఫారూఖ్ చొరవతో స్వదేశానికి చేర్చగలిగారు. 17 సంవత్సరాలుగా స్వదేశంలోని అతని భార్య, పిల్లలు మోండయ్యను చూడలేదు.

ఇవి కూడా చదవండి:

హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు

దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 04:31 PM