Share News

NRI: సౌదీలో ప్రధాని మోదీతో సమావేశమైన తెలుగు ఎన్నారైలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:25 PM

భారత ప్రధాని మోదీ సౌదీ పర్యటన సందర్భంగా తెలుగు ఎన్నారైలు ఆయనతో సమావేశమయ్యారు.

NRI: సౌదీలో ప్రధాని మోదీతో సమావేశమైన తెలుగు ఎన్నారైలు
PM Narendra Modi meets Telugu NRIs

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలలో భాగంగా విధిగా ప్రవాసీ ప్రముఖులను కలుస్తుంటారు. ఇటీవల తన సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు ప్రవాసీయులతో సమావేశమై యోగక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల బృందానికి నాయకత్వం వహించిన జెద్ధా నగరంలోని తెలుగు ప్రవాసీ మహిళ నాయకురాలు గాలి దుర్గా భవానీ ప్రధానితో మాట్లాడారు. మోదీ ప్రధాని అయినందుకు తమకు సంతోషంగా ఉందని బాపట్ల జిల్లా మండలం పిట్టలవానిపాలెం మండల కేంద్రానికి చెందిన దుర్గా భవానీ వ్యాఖ్యానించగా తానేమి నేరుగా ప్రధాని కాలేదని, మీరంతా కలిసి నన్ను ప్రధానిగా ఎన్నుకున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇందుకు వారందరికీ కృతజ్ఞతలని మోదీ వ్యాఖ్యానిస్తూ అమె భర్త విజయవాడలోని పడమటకు చెందిన కోటి శివ రామకృష్ణా భుజాన్ని తట్టారు.


ప్రధానిని కలిసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో పాస్టర్ హానూక్ అభినయ్ (కర్నూలు), దీపక్ సాగర్ (హైదరాబాద్), రామరావు (గుంటూరు), దుర్గా భవానీ గాలి (బాపట్ల) , శాంతి వంక (హైదరాబాద్), రజనీ శ్రీహరి (తెనాలి), కిషోర్ వికటకవి (విశాఖపట్టణం), డాక్టర్ ఫుర్ఖాన్ తారిఖ్ (హైదరాబాద్), వాసే (హైదరాబాద్), ఇర్ఫాన్ అల్లాఉద్దీన్ (హైదరాబాద్), మీర్ ఘజన్ఫర్ జకీ (హైదరాబాద్), అమిత్ వంకా (హైదరాబాద్), కోటి శివ రామకృష్ణా (పడమట, విజయవాడ), సాగర్ కుంట (హైదరాబాద్), రఫీక్ బందుబాయి, బాలు విశ్వేశ్వర రావు, వెంకట్ సొడగం (హైద్రాబాద్) , మస్తాన్ శేఖ్ (నర్సరావుపేట), షబ్బీర్ అలీ (విశాఖపట్టణం), మిర్జా ఖుద్రత్‌లు (హైదరాబాద్) ఉన్నారు.


అంతకు ముందు, ప్రధానికి స్వాగతం పలికిన వారిలోనూ ముందు వరుసలో తెలుగు ప్రవాసీయులు ఉన్నారు. రంజీత్ చిట్లూరి (చిత్తూరు జిల్లా) గడ్డం శిల్పా (ప్రకాశం జిల్లా) సుచరిత (సికింద్రాబాద్) నాగార్జున (హైదరాబాద్) శాంతి (పాలకొల్లు) అమిత ఆనందోత్సాహాల మధ్య ప్రధానికి స్వాగతం పలికారు.

వీరితో సమావేశమైన అనంతరం జరిగిన అధికారిక కార్యక్రమాలలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగిన నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

ఇవి కూడా చదవండి:

బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

డల్లాస్‌ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని

Read Latest and NRI News

Updated Date - Apr 29 , 2025 | 06:25 PM