Share News

NRI News: హాంకాంగ్ లో ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:47 PM

దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే తన కోరిక నెరవేరలేదని, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో సీటు దక్కలేదని, అయితే ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కలని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని ఊహించలేద టోరీ రేడియో వ్యాఖ్యాత జయ పీసపాటి పేర్కొన్నారు. తన రేడియో షో పేరు జై హింద్ అని చెబుతూ ఆ పేరు ఎంచుకున్నందుకు గల కారణాలను వివరించారు.

NRI News: హాంకాంగ్ లో ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్
Kargil Vijay Diwas celebration completes in Hong Kong

దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే తన కోరిక నెరవేరలేదని, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో సీటు దక్కలేదని, అయితే ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కలని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని ఊహించలేద టోరీ రేడియో వ్యాఖ్యాత జయ పీసపాటి పేర్కొన్నారు. తన రేడియో షో పేరు జై హింద్ అని చెబుతూ ఆ పేరు ఎంచుకున్నందుకు గల కారణాలను వివరించారు. హిందీ వివిధభారతిలో వచ్చే 'జయ్ మాల' అనే సైనికుల కార్యక్రమం తనకు అత్యంత ప్రియమైన ప్రోగ్రాం కాబట్టి దానికి తగినట్టుగా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా తన కార్యక్రమానికి 'జై హింద్' అని పేరు పెట్టినట్టు చెప్పారు.

nri4.jpg


తన జై హింద్ కార్యక్రమం ద్వారా విశ్రాంత సైనికులను, వీర నారీలను, త్రిదళాల కుటుంబాలకు సేవలు అందచేసే స్వచ్ఛంద సంస్థలను పరిచయం చేశానని చెప్పారు. కార్గిల్ విజయ్ దివస్ వెనుక వున్న త్యాగం, భావోద్వేగాలు, ఆనందాన్ని అర్థం చేసుకొని కార్గిల్ విజయ దివస్‌ని హాంకాంగ్‌లో చేస్తున్నట్టు జయ తెలిపారు. సైనికుల జీవితాలను, వారి కుటుంబ త్యాగాలను సామాన్య పౌరులకు తెలియజేసే ప్రయత్నమే తన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, అందుకు టోరీ రేడియో యాజమాన్యం, శ్రోతలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, ఆ స్ఫూర్తితో ఒక పుష్కర కాలంగా 'జై హింద్' షో చేస్తున్నానని తెలిపారు.

nri2.jpg


హాంకాంగ్ ప్రవాస భారతీయులందరు, ప్రతి సంవత్సరం 'సురభి ఏ ఎహసాన్' కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తారని జయ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' కార్యక్రమంలో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీలు, హిందీలో కవితలు, గీత రచనల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ సురభి గోయల్, భారతీయ గోర్ఖా రెజిమెంట్ విశ్రాంత జవాన్లు హాజరయ్యారు. అలాగే టచ్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

nri3.jpg


ఈ సందర్భంగా సురభి గోయల్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ పౌరులను ఒక తాటి పైకి తీసుకొచ్చి దేశ రక్షకుల గురించి అవగాహన కల్పించడాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ తరం వారికి చక్కటి సందేశాన్ని అందించే కార్యక్రమ స్ఫూర్తిని అభినందించారు. అనంతరం పిల్లలు,పెద్దలు సీనియర్ సిటిజన్లు దేశభక్తి గీతాలు, నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను సురభి అందజేశారు.

మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 04:53 PM