NATS North Carolina: అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:26 PM
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఛైర్మన్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అమెరికాలోని ఉత్తర కరోలీనాలో షార్లెట్‌లో నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది.
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఛైర్మన్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అమెరికాలోని ఉత్తర కరోలీనాలో షార్లెట్‌లో నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది. షార్లెట్‌లో తెలుగు వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్ఠను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి కోరారు (NATS program).
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణమూర్తి గులివందల హాజరయ్యారు (NATS regional events). నాట్స్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి, ఉమా నార్నె, భాను నిజాంపట్నం, కల్పనా అధికారి తదితరులు పాల్గొన్నారు. విభాగం ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

షార్లెట్ నాట్స్ ప్రతినిధులు:
దీపిక సయ్యాపరాజు – చాప్టర్ కోఆర్డినేటర్
పల్లవి అప్పాణి – జాయింట్ కోఆర్డినేటర్
వినీలా దొప్పలపూడి – ఈవెంట్స్
ప్రవీణ పాకలపాటి – మహిళా సాధికారత
వెంకట్ యలమంచిలి – ట్రెజరర్
లక్ష్మీ బిజ్జల – జాయింట్ ట్రెజరర్
సిద్ధార్థ చగంటి – క్రీడలు
సుమ జుజ్జూరు – సోషల్ మీడియా

ఈ వార్తలు కూడా చదవండి..
దుబాయ్‌లో దేవతా వనాల మధ్య జనసేన వనభోజనాలు
గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాలు నడపాలి..ఏపీ సీఎంకు ఎన్నారైల విజ్ఞప్తి