Share News

Fake ICE Agent: అమెరికాలో భారతీయ యువతికి షాక్.. ఏకంగా 5 వేల డాలర్ల నష్టం

ABN , Publish Date - Jun 08 , 2025 | 05:10 PM

అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి మోసగాళ్ల బారిన పడి ఏకంగా 5 వేల డాలర్లు నష్ట పోయింది. ఇలాంటి తప్పు మరెవరూ చేయొద్దని సాటి విద్యార్థులకు సూచించింది.

Fake ICE Agent: అమెరికాలో భారతీయ యువతికి షాక్.. ఏకంగా 5 వేల డాలర్ల నష్టం
Indian student ICE scam

అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారులమని చెప్పుకున్న నేరగాళ్లు ఆమెకు ఏకంగా 5 వేల డాలర్ల నష్టం మిగిల్చారు. దాచుకున్న డబ్బంతా పోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.

శ్రియా బేడీ అనే యువతి ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్‌లో మాస్టర్స్ చదువుతున్నారు. 2022లో ఎఫ్-1వీసాపై ఆమె అమెరికా వెళ్లారు. అయితే, మే 29న ఆమెకు నిందితుడి నుంచి ఫోన్ వచ్చింది. తాను ఇమిగ్రేషన్ అధికారినని చెప్పుకున్న అతడు శ్రియను బెదిరించాడు. వలసల చట్టాలను ఉల్లంఘించావని భయపెట్టాడు. ‘తన పేరు బ్యాడ్ నెంబర్ నాకు ఇచ్చాడు. కావాలంటే ఐసీఈ డాట్ కామ్ వెబ్ సైట్‌లో తన పేరును తనిఖీ చేసుకోవచ్చని అన్నాడు. ఆ తరువాత మరో వ్యక్తి ఫోన్ చేశాడు’

‘తాను ఒలింపియా పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నట్టు తెలిపాడు. నా ఫోన్‌పై నిఘా పెట్టామని, కాల్ కట్ చేయొద్దని సూచించాడు. నా పేరిట అరెస్టు వారెంట్ జారీ అయ్యిందని అన్నాడు. నాకు చాలా భయం వేసింది. వారు దాదాపు మూడు గంటల పాటు ఫోన్‌ సంభాషణ కొనసాగించారు. ఫోన్ పెట్టేయొద్దని బెదిరించారు. అలా చేస్తే నా కేసు మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు. రిస్క్ చేయడం ఇష్టం లేక నేను వారు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది’


‘నా వ్యక్తిగత సమాచారం అంతా వారి వద్ద ఉంది. నేను ఏ భారతీయ నగరానికి చెందిన దాన్నో, అమెరికాకు ఎలా వచ్చాను అనే విషయాలన్నీ వాళ్లకు తెలుసు. ఇవి ప్రభుత్వ విభాగాలకు మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంది’ అని ఆమె తెలిపింది.

నిందితులు తనతో 5 వేల డాలర్ల విలువైన యాపిల్, టార్గెట్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించారని శ్రియ చెప్పింది. ఆ కోడ్స్ తమకు ఇవ్వమని వారు అడిగినట్టు తెలిపింది. మరుసటి రోజు పోలీసు ఆఫీసర్ వచ్చి వాటికి తీసుకుంటారని చెప్పినట్టు వెల్లడించింది. కానీ ఆ తరువాత ఎవ్వరూ రాలేదని తెలిపింది. అరెస్టు, దేశ బహిష్కరణ పేరిట గంటల తరబడి తనకు నరకం చూపించారని వెల్లడించింది.


ఏకంగా 5 వేల డాలర్లు కోల్పోవడంతో తన ఆర్థిక స్థితి తలకిందులైందని ఆమె చెప్పింది. అమెరికాలో ఒంటరిగా ఉంటున్నానని, ఎలాంటి కుటుంబ మద్దతు లేదని వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు దాచి పెట్టిన సొమ్ము మొత్తం పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాలో వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థంకాక మోసగాళ్ల బారిన పడ్డానని తెలిపింది. తనలా మరొకరు మోసపోకుండానే ఈ విషయాల్ని పంచుకుంటున్నట్టు వెల్లడించింది. లాయర్లను, పోలీసులను ఆశ్రయించే హక్కు అంతర్జాతీయ విద్యార్థులకూ ఉంటుందన్న విషయం మర్చిపోకూడదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాలో దారుణం.. అరెస్టు సమయంలో తీవ్ర గాయాలు.. కోమాలో భారత సంతతి వ్యక్తి

సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు

Read Latest and NRI News

Updated Date - Jun 08 , 2025 | 05:19 PM