Share News

San Jose: శాన్ జోస్‌లో ఐసీఏసీ ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!

ABN , Publish Date - Aug 03 , 2025 | 07:13 AM

శాన్ జోస్‌లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను అమెరికాలో భారత రాయబారి (అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ఏ) వినయ్ క్వాత్రా వర్చువల్‌‌గా ప్రారంభించారు.

San Jose: శాన్ జోస్‌లో ఐసీఏసీ ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!
Indian Consular Application Center San Jose

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని శాన్ జోస్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో తీపి కబురు అందించింది. శాన్ జోస్‌లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను (ICAC) అమెరికాలో భారత రాయబారి (అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ఏ) వినయ్ క్వాత్రా వర్చువల్‌‌గా ప్రారంభించారు. ప్రారంభోత్సవ సమయంలో కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి ఐసీఏసీ కార్యాలయంలో ఉన్నారు. ఆయనతో పాటు భారతీయ డయాస్పొరా నాయకులు కూడా ఉన్నారు.

ఆగస్టు 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని క్వాత్రా పేర్కొన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయులకు కాన్సులేట్ సేవలను ఇంటివద్దకే తీసుకువచ్చామని, ఆ సేవలను మరింత విస్తరించేందుకే ఐసీఏసీని ప్రారంభించామని తెలిపారు.

2.jpg


బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, అడిసన్, ఓర్లాండో, రాలీ, శాన్ జోస్.. మొత్తం 8 నగరాల్లో దీనిని ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల ద్వారా కాన్సులర్ సేవలు మరింత విస్తరిస్తామని తెలిపారు. ఐసీఏసీ ద్వారా కాన్సులర్ సేవలను మరింత వేగంగా అందిస్తామన్నారు. భారతీయ డయాస్పోరాకు కాన్సులేట్ సేవలను సులభతరం చేయబోతున్నామని చెప్పారు.

ఇకపై శాన్ జోస్‌లో పాస్‌పోర్ట్, వీసా, ఓసీఐ, పవర్ ఆఫ్ అటార్నీ, బర్త్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్, అటెస్టేషన్స్, ఎన్‌వోఆర్ఐ, పీసీసీ (విదేశీయుల కోసం), లైఫ్ సర్టిఫికెట్(నాన్ పెన్షన్) తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫార్మ్ ఫిల్లింగ్, ఫొటోగ్రాఫ్స్, ఫొటోకాపీ, రిటర్న్ కొరియర్ తదితర సేవలను ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే అందించనున్నారు. ఆగస్టు 1 నుండి అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు సోమవారం నుంచి శనివారం వరకూ తెరిచి ఉంటాయి. అపాయింట్‌మెంట్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.

ఐసీఏసీ అడ్రస్:

San Jose ICAC: Suite D100, 1580-1630 Old Oakland Road, San Jose, CA

services.vfsglobal.com/usa/en/ind/ లింక్‌పై క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు


ఈ వార్తలు కూడా చదవండి:

హాంకాంగ్ లో ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్

వైభవంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం

Read Latest and NRI News

Updated Date - Aug 03 , 2025 | 07:19 AM