NRI: గల్ఫ్ జనసేన యూఏఈ నేతల దాతృత్వం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:54 PM
గల్ఫ్ జనసేన యూఏఈ నాయకులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో ఓ వ్యక్తికి వైద్యం కోసం రూ. లక్షను ఆర్థిక సాయంగా అందించారు.

పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామం మెట్ల కాలనీకి చెందిన అద్దంకి నాగేశ్వరరావు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయం జనసేన నాయకులు అల్లాడ రవి ద్వారా తెలిసిన గల్ఫ్ జనసేన యూఏఈ ఇన్‌చార్జి కేసరి త్రిమూర్తులు, మొగళ్ల చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం ఆపన్న హస్తం అందించింది. జననాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని అనుసరిస్తూ ఆర్థిక సాయం అందించింది. గల్ఫ్ జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో పి.గన్నవరం జనసేన పార్టీ కార్యాలయంలో, ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా బాధితుడికి రూ.100000 అందజేశారు. గల్ఫ్ జనసేన యూఏఈ బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందిస్తూ ప్రశంసలు గుప్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిరిగినెడి వెంకటేశ్వరరావు, గంగలకుర్రు అగ్రహారం సొసైటీ చైర్మన్ అల్లాడ రవి, పి.గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు, పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని పి.గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించడానికి గల్ఫ్ జనసేన యూఏఈ బృందం గర్వంగా భావిస్తోందని, భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రముఖ ఎన్నారై వైద్యుడు డా. పొలిచెర్ల హరనాథ్‌కు పౌర సన్మానం
డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు