దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు: టీజీఎమ్‌డీసీ చైర్మన్
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:51 PM
దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వ్యక్తుల కుటుంబసభ్యులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టు టీజీఎమ్‌డీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి తెలిపారు.

జపాన్ పర్యటనలో ఉండగా సీఎం స్పందించినట్టు వెల్లడి
మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారని వెల్లడి
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్‌లు దుబాయిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయిలోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు.
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బీఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఇవి కూడా చదవండి:
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి