Dallas Eid Milap: డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని
ABN , Publish Date - Apr 18 , 2025 | 09:19 PM
డల్లాస్‌లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నసీం షేక్ సమన్వయంలో శనివారం ఇర్వింగ్‌లోని విమల్ బాంక్వెట్ హాల్‌లో ఈ వేడుకను స్థానికులతో కలిసి నిర్వహించారు.

డల్లాస్‌లో ముస్లిం సంఘీభావం, శాంతి, మానవతా విలువలకు బలమైన సందేశాన్ని ఇచ్చే విధంగా నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నసీం షేక్ సమన్వయంలో శనివారం ఇర్వింగ్‌లోని విమల్ బాంక్వెట్ హాల్‌లో ఈ వేడుకను స్థానికులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్తర అమెరికా ఆంధ్ర ముస్లిం సంఘం (AMANA) ఆధ్వర్యంలో జరిగింది. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సమాజాల నుంచి ప్రవాసులు హాజరయ్యారు.
డా. చంద్రశేఖర్ పెమ్మసాని రంజాన్, ఈద్-ఉల్-ఫిత్ర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అనేది ఆకలి గురించి మాత్రమే కాదు, మానవతను స్మరించుకునే అవకాశం అని పేర్కొన్నారు. ముస్లిం సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. AMANA ప్రతినిధి నసీం షేక్ మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలోని ఆంధ్ర ముస్లిం కుటుంబాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు, ఆంధ్రప్రదేశ్‌లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సంస్థ స్థాపన జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో షాజహాన్ షేక్, రియాజుద్దీన్ షేక్, అబ్దుల్ మాజిద్, జమీరుద్దీన్ మొహమ్మద్, ముజాహిద్ షేక్, సిద్దిఖ్, ముస్తఫా, ఇస్మాయిల్ పెనుకొండ, జాకీర్, నవీదుద్దీన్, ఇంతియాజ్, బాల చెరుకూరి, భాను ప్రకాష్, పవన్ బెల్లం, విజయ్ బొర్రా, రామ్ గుళ్ళపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి