Share News

Chandrababu Naidu: సెయింట్ లూయిస్‌లో వైభవంగా ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 07:56 AM

మిస్సోరీలోని సెయింట్‌ లూయీస్‌లో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Chandrababu Naidu: సెయింట్ లూయిస్‌లో వైభవంగా ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
Chandrababu Naidu 75th birthday Missouri

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో సమిష్టిగా ఈ వేడుకలు నిర్వహించారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడిగా మరింత కాలం సేవలందించాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని సభికులు ఆకాంక్షించారు.


ఈ వేడుకలో సెయింట్ లూయిస్ తెదేపా అధ్యక్షుడు కిషోర్ యార్లగడ్డ, ఎన్నారై తెదేపా ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి, ప్రాంతీయ సమన్వయకర్త రాజా సూరపనేని, తెదేపా సీనియర్ నేత రజినీకాంత్ గంగవరపు, కిషోర్ యరపోతిన, రవి పోట్ల, విజయ్ బుడ్డి, సురేన్ పాతూరి, శ్రీకాంత్ సూరపనేని, బెల్లంకొండ నాగ, సాక్షి విజయ్ (జనసేన), సత్య గాజుల(జనసేన), వాణీ గంగవరపు, పల్లవి సూరపనేని, మమత చదలవాడ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

డల్లాస్‌ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని

Read Latest and NRI News

Updated Date - Apr 25 , 2025 | 08:01 AM