Chandrababu Birthday Celebrations: ఛార్లెట్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 08:30 AM
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ, చంద్రబాబు అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఛార్లెట్‌లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలను సందడిగా జరుపుకున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఛార్లెట్‌లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందడిగా జరుపుకున్నారు. ఛార్లెట్‌లోని కంఫర్ట్ ఇన్ సూట్స్‌లో జరిగిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, ఎన్నారైలు హాజరయ్యారు. నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిపారు. ఎన్నారై టీడీపీ పార్టీ నాయకులతో కలిసి పిల్లలు, మహిళలు చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా గుడివాడ శాసనసభ్యుడు, ఎన్నారై వెనిగళ్ళ రాము మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వచ్చినప్పటికీ నేటికీ 18 గంటలకుపైగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే విజనరీ ఉన్న నాయకుడని కొనియాడారు. చాలామంది 60 ఏళ్లు వచ్చిన తరువాత రిటైర్ అయ్యామంటూ పనుల నుంచి విశ్రాంతి తీసుకుంటారని, కాని చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు వచ్చినప్పటికీ ప్రజల కోసం పనిచేయడం తనకు ఇష్టమంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తూ ఉన్నారని కొనియాడారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఛార్లెట్ టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు.
ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, సతీష్ నాగభైరవ, బాలాజి తాతినేని, ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు. చివరన ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని