Chandrababu Birthday Celebrations: బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 07:26 AM
బహ్రెయిన్‌లో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన ఓ విజనరీ లీడర్ అంటూ కొనియాడారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంద్రప్రదేశ్ నిర్మాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలు బహ్రెయిన్‌లో ఘనంగా జరిగాయి. తెలుగు దేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు వేడుకల్లో పాల్గొని చంద్రబాబు పార్టీ కోసం, ప్రజలకోసం చేసిన కృషిని కొనియాడారు. వివిధ రంగాలలో దేశ విదేశాలలో కూడా గుర్తింపు కలిగిన ఎకైక నాయకుడు మన బాబు గారు అని అన్నారు.
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు అయితే ఐటి, వివిధ రంగాలలో తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందని అన్నారు.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి, తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ అని వక్తలు అన్నారు. ఆడపడుచులకు అండగా నిలిచి,రైతన్నల కన్నీరు తుడిచి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చి, దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించేలా ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు వడ్లమూడి రఘునాద బాబు, తక్కెళ్ళపాటి హరిబాబు, పి జే నాయుడు, సతీశ్ బోల్ల, రామ మోహన్ కొత్తపల్లి, అనిల్ కుమార్ ఆరే, చంద్రబాబు నాయుడు, సతీశ్ శెట్టి, అశోక్ గణపర్తి, బాస్కర్ రావు, ఎవి రావు, శివ కోటేశ్వర రావు, జగదీష్, అశోక్,అనిల్ పమిడి, కొత్తపల్లి రాజశేకర్, ప్రసాద్, వెంకట్ గుడిపాటి, ఇంతియాజ్ అహ్మద్, పూర్ణ ఉన్నగిరి, బాలకృష్ణ, నాగార్జున, వంశీకృష్ణ చౌదరి, సందీప్ చౌదరి, మౌళి చౌదరి, భవాని శంకర్, దయాకర్, రాజేష్ , దావాకర్, జయరామ్ , ప్రకాష్, కిషోర్, షణ్నుక్, శ్రీనివాస్ కావురి, శ్రీనివాస్, వెంకట్ పోకూరి, వెంకట్ , నాగరాజు నాయుడు, బాలగంగాదర్, చైతన్య, సతీష్ రావూరి, శ్రీనివాసరావు కోగంటి, సురేంద్ర, వెంకట్ కొల్ల, అశోక్ పొట్లూరి, మహేష్ మీరా, రామ కిషోర్ , రవి చౌధరి, ప్రవీణ్, రామకృష్ణ ఛౌదరి, వంశీ, భీమా నాయుడు, కృష్ణ, హనుమంతు రావు, ప్రసాద్, మాదవ, నాగరాజు, నారాయణ, సత్య, శరత్, అమరావతి వారియర్స్ క్రికెట్ టీమ్ సభ్యులు, బహ్రెయిన్ కాకతీయ సంఘం సభ్యులు తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షాలు తెలియచేశారు.
ఇవి కూడా చదవండి:
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని