Chandrababu Birthday Celebrations: కాలిఫోర్నియాలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:14 PM
ఏపీ సీఎం చంద్రబాబు అభిమానులు ప్రపంచంవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో చంద్రబాబు 75 వ పుట్టిన రోజు వేడుకలు భారత కాలమానం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగాయి. శాన్ రామోన్ లోని స్పోర్ట్స్ పార్క్‌లో ఈ వేడుకలు అంబరాన్నంటాయి.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఏప్రిల్ 20న 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో చంద్రబాబు 75 వ పుట్టిన రోజు వేడుకలు భారత కాలమానం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగాయి. శాన్ రామోన్ లోని స్పోర్ట్స్ పార్క్‌లో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ఏప్రిల్ 19న శనివారం సాయంత్రం 5 గంటలకు మొదలైన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. కాలిఫోర్నియాలోని టీడీపీ, చంద్రబాబు అభిమానులందరినీ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకులను నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిపారు (Chandrababu 75th birthday celebrations in California).
గత ఏడాది మాదిరిగానే పిల్లలు, పెద్దలు అందరూ భారీగా ఈ వేడుకలకు హాజరై సందడి చేశారు. చంద్రబాబు మద్దతుదారులు NRI TDP , Happy Birthday CBN అనే సందేశాన్ని కలిగున్న బ్యానర్‌లను, టీడీపీ గొడుగులను మహిళలు పసుపు చీరలను ధరించి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో చిన్నారులు, ఎన్నారై టీడీపీ పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ట్రై వ్యాలీ ఎన్నారై టీడీపీ నాయకులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పసందైన విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ట్రై వ్యాలీ ఎన్నారై టీడీపీ నాయకుడు ఎంవీ రావు సమన్వయ పరిచారు. సురేష్ పోతినేని, శ్రీకాంత్ దొడ్డపనేని, రామ్ మద్దినేని, సూర్యనారాయణ ఆలపాటి , గీతా ఆలపాటి, వంశీ పాలడుగు , చంద్ర గుంటుపల్లి, సాగర్ దొడ్డపనేని ల్పా మద్దినేని, ఆదినారాయణ , రామ్ బైరపనేని, నరేష్ జంపాని, బాలకృష్ణ కంతేటి, గాంధీ పాపినేని, వెంకట్ కోగంటి, శ్రీనివాస్ వేముల, వంశీకృష్ణ నేలకుడిటి, నరహరి మర్నేని మరియు హరిబాబు బొప్పుడి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని