Share News

Canada Visa Woes: పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:46 PM

భారతీయుల కెనడా పర్యాటక వీసా దరఖాస్తుల పరిశీలనకు ప్రస్తుతం 99 రోజుల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటే ఇది 13 రోజులు అధికమని కెనడా మీడియా చెబుతోంది. పాకిస్థానీ అప్లికేషన్ల పరిశీలన 59 రోజుల్లో పూర్తవుతోందట.

Canada Visa Woes: పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..
Canada tourist visa Processing time

ఇంటర్నెట్ డెస్క్: కెనడా పర్యాటక వీసా కోసం ప్రయత్నిస్తున్న భారతీయుల దరఖాస్తుల పరిశీలనకు సమయం మరింత పెరిగింది. ప్రస్తుతం భారతీయుల దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు 99 రోజులు పడుతున్నట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రాసెసింగ్ సమయం 13 రోజుల మేర పెరిగింది. కెనడా మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ఇక కెనడా శాశ్వత నివాసార్హత ఉన్న వారి తల్లిదండ్రులు, తాతాబామ్మలకు ఇచ్చే సూపర్ వీసా (ప్రత్యేక టూరిస్టు వీసా) ప్రాసెసింగ్ సమయం 169 రోజులుగా ఉంది (Canada Tourist Visa Processing Time).

అమెరికన్ దరఖాస్తుల పరిశీలనకు 36 రోజులు, నైజీరియన్‌ అప్లికేషన్ల పరిశీలనకు 27 రోజులకు, పాకిస్థానీ అప్లికేషన్‌లకు 59 రోజులు పడుతున్నట్టు తెలిసింది. ఇక కెనడా పౌరసత్వం కోసం ప్రస్తుతం 2.90 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం 13 నెలలుగా ఉంది.


భారీ స్థాయిలో దరఖాస్తులు రావడం, దేశాలవారీగా ప్రత్యేక పరిశీలనలు, వనరుల కొరత, భారత్ వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల కారణంగా అప్లికేషన్‌ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతున్నట్టు కెనడా మీడియా చెబుతోంది. అయితే, కెనడా స్టడీ పర్మిట్ దరఖాస్తుల పరిశీలన సమయం కొద్దిగా మెరుగై నాలుగు వారాలకు చేరుకుంది. వర్క్ పర్మిట్‌ల ప్రాసెసింగ్ కోసం ప్రస్తుతం 10 వారాల పాటు వేచి చూడాల్సి వస్తోంది. ఆగస్టులో భారతీయుల స్టడీ పర్మిట్‌ అప్లికేషన్‌ల తిరస్కరణ రేటు ఏకంగా 74 శాతం ఉన్నట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై మళ్లీ నిందలు వేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 10:52 PM