Ancient India Epic: వాల్మీకి నారద సంభాషణే ఈ రామాయణం
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:04 AM
సీతారాముల జీవితచరిత్ర రసరమ్యమైనది. కొన్ని వేల ఏళ్లుగా భారతావనికి జీవధారలాంటిది. మన పూర్వీకులు దీన్ని వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల స్థాయిలో నిలిపారు. వాల్మీకి మహర్షి విరిచిత రామాయణానికి గత వెయ్యేళ్లలో...

వ్యాసపీఠం
సీతారాముల జీవితచరిత్ర రసరమ్యమైనది. కొన్ని వేల ఏళ్లుగా భారతావనికి జీవధారలాంటిది. మన పూర్వీకులు దీన్ని వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల స్థాయిలో నిలిపారు. వాల్మీకి మహర్షి విరిచిత రామాయణానికి గత వెయ్యేళ్లలో అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. మహేశ్వర తీర్ధుల ‘తత్త్వదీపిక’, గోవిందరాజుల ‘భూషణం’, త్రయంబక మఖిన్ రాసిన ‘ధర్మకూతం’, మాధవయోగి ‘అమృతకటకం’, నాగేశభట్టు ‘తిలకం’, వంశీధర శివసహాయ శిరోమణి లాంటి గ్రంథాలు రామాయణాన్ని భిన్నమైన పార్శ్వాల నుంచి విశ్లేషించాయి. ఇక భారతీయ భాషల్లో వెలువడిన రామాయణాల గురించి వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగులో మొల్ల, మళయాళంలో ఎళుత్తాచాన్, ఒడియాలో బాలరాముడు, అవధిలో తులసీదాసు, బెంగాలీలో కృత్తివాసుడు, కన్నడంలో తొరవేలు రాసిన గ్రంథాలు వాల్మీకి మూల రామాయణానికి అనేక మెరుగులు అద్దాయి. ఈ గ్రంథాలన్నింటిలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నింటినీ తీసుకొని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దుష్యంత్ శ్రీధర్ ఇంగ్లీషులో ఒక రామాయణాన్ని రాశారు. దీనిని ప్రముఖ రచయిత్రి శ్రీదేవి మురళీధర్ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకంలో కథ అంతా వాల్మీకి- నారదుల మధ్య సంభాషణగా నడుస్తుంది. శ్రీదేవి మురళీధర్ అనువాదం... సరళమైన తెలుగులో, అందరికీ సులభంగా అర్ధమయ్యేలా ఉంది. రామాయణంపై ఆసక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.
రామాయణం
మూల రచన: దుష్యంత్ శ్రీధర్
అనువాదం: శ్రీదేవి మురళీధర్
ప్రచురణ: హార్పర్ కాలిన్స్
అమెజాన్‌తో సహా అన్ని పుస్తక కేంద్రాల్లో లభిస్తుంది.
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..