Share News

అవకాడోతో ఆరోగ్యం

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:05 AM

కొన్నాళ్లుగా అవకాడోల వినియోగం పెరిగింది. ఈ అవకాడోల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...

అవకాడోతో ఆరోగ్యం

కొన్నాళ్లుగా అవకాడోల వినియోగం పెరిగింది. ఈ అవకాడోల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...

  • అవకాడోలో విటమిన్‌ బి6, సి, ఇ, కె వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ శరీరంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తాయి.

  • అవకాడోలోని మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి.

  • శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగకుండా అవకాడో నియంత్రిస్తుంది. దీని వలన గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

  • అవకాడోలోని ఫొలేట్‌ మెదడు చురుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది.

  • అవకాడోలో ఉండే కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్‌), ఫైబర్‌ ఆకలిని నియంత్రించి శరీర బరువు తగ్గడంలో సహాయపడతాయి.

  • ఫైబర్‌ అజీర్తి సమస్యలను కూడా నివారిస్తుంది. పేగు ఆరోగ్యానికి సహాయ

    పడతుతుంది.

  • అవకాడోలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు మంట, వాపులను తగ్గించడంలో ఉపయోపడతాయి.

  • గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు అవకాడో వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అవకాడోలోని పోషకాలు ప్రెగ్రెన్సీలో సమస్యలను నివారించడంతో పాటు, ప్రసవం తర్వాత తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 05:05 AM