Prashanth Varma: వీఎఫ్ఎక్స్ తో దర్శకులకు స్వేచ్ఛ వచ్చింది
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:27 AM
వీఎఫ్ఎక్స్ తో దర్శకులకు స్వేచ్ఛ వచ్చింది ‘హనుమాన్’ గుర్తుందా? ఆ సినిమాలో హనుమంతుడి విగ్రహం... ఆ చుట్టుపక్కల కొండలు.. చిన్న గ్రామం గుర్తున్నాయా? అవన్నీ కంప్యూటర్ ద్వారా తయారుచేసి దృశ్యాలని అని చాలామందికి...

విన్నర్
వీఎఫ్ఎక్స్ తో దర్శకులకు స్వేచ్ఛ వచ్చింది ‘హనుమాన్’ గుర్తుందా? ఆ సినిమాలో హనుమంతుడి విగ్రహం... ఆ చుట్టుపక్కల కొండలు.. చిన్న గ్రామం గుర్తున్నాయా? అవన్నీ కంప్యూటర్ ద్వారా తయారుచేసి దృశ్యాలని అని చాలామందికి తెలియదు. వీఎ్‌ఫఎక్స్ అని అందరూ సాంకేతిక పరిభాషలో పిలుచుకొనే ఈ దృశ్యాలను తెరకు ఎక్కించింది... హైదరాబాద్‌కు చెందిన ‘హేలోహ్యూస్’ అనే కంపెనీ. ‘హనుమాన్’ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్‌కు తాజాగా జాతీయ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ‘హేలోహ్యూస్’ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పవన్ వీరమనేని... ‘నవ్య’తో మాట్లాడారు.
కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ (సీజీఐ)... విజువల్ ఎఫెక్ట్స్ ... గ్రాఫిక్స్ ఇలా రకరకాలుగా అంటారు కదా!
అన్నీ ఒకటే. కంప్యూటర్ ద్వారా తయారుచేసే దృశ్యాలే విఎఫ్ఎక్స్. దర్శకుడి ఊహకు వాస్తవ రూపం కల్పించేది, ఇవి నిజమని భ్రమించేలా చేసేదీ వీఎఫ్ఎక్స్.
వీటిని మన తెలుగు సినిమాల్లో చాలా కాలంగా వాడుతున్నారు కదా..!
పూర్వకాలం అనేక సినిమాల్లో ఈ తరహా సన్నివేశాలు ఉండేవి. ‘మాయాబజార్, కీలుగుర్రం’... విఠలాచార్యగారు తీసిన అనేక సినిమాల్లో వీటిని మనం చూడవచ్చు. మిగిలిన భాషలతో పోలిస్తే మన దగ్గరే ఇలాంటి సన్నివేశాలు ఎక్కువ. ఆ సమయంలో కంప్యూటర్లు లేవు కాబట్టి సెట్లు వేసి కెమెరా ట్రిక్స్‌తో మనకు ఆ భావన కలిగించేవారు. ఆ తర్వాతి కాలంలో సాంఘిక సినిమాలు రావటం మొదలుపెట్టాక వీటిని వాడటం మానేశారు. దర్శకుడు రాజమౌళి తీసిన ‘మగధీర’ నుంచి ఈ ట్రెండ్ మళ్లీ మొదలయింది. ‘మగధీర’లో కనిపించే కోటలన్నీ వీఎ్‌ఫఎక్స్‌లో రూపొందించినవే! వాటిని ‘మకుటా’ అనే కంపెనీలో రూపొందించాం. నేను కూడా మొదట ఆ కంపెనీలోనే పనిచేసేవాడిని. ఆ తర్వాత కాలంలో ‘బాహుబలి, బాహుబలి2’కు సంబంధించిన వీఎ్‌ఫఎక్స్‌లు కూడా అక్కడే చేశాం. ఆ తర్వాత నేను విదేశాలకు వెళ్లిపోయాను. హాలివుడ్‌లో పనిచేశాను. మళ్లీ హనుమాన్ సమయానికి తిరిగి వచ్చాను.
అంటే వీఎఫ్ఎక్స్ ఒరవడిని ప్రవేశపెట్టింది రాజమౌళే అనవచ్చా?
‘మగధీర’ నుంచి విఎఫ్ఎక్స్ వాడటం మళ్లీ మొదలయింది. ఈ సినిమా తర్వాత అందరూ తమ సినిమాలో ఏదో ఒకచోట వాడటం మొదలుపెట్టారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఉదాహరణకు మన పార్లమెంట్ నేపథ్యంలో ఒక సీను తీయాలనుకుందాం. అక్కడ షూటింగ్‌కు అనుమతి దొరకటం కష్టం. అందువల్ల దానిని గ్రీన్‌మ్యాట్ లేదా బ్లూమ్యాట్‌లో షూట్ చేస్తారు. ఆ తర్వాత ఈ సీన్లకు విఎఫ్ఎక్స్ ద్వారా పార్లమెంట్ దృశ్యాలు కలుపుతాం. ఇంకో ఉదాహరణ చెబుతాను. ‘థగ్‌లైఫ్’ సినిమాలో చూపించిన మంచుకొండలు వీఎ్‌ఫఎక్స్ ద్వారా రూపొందించినవే!
హనుమాన్ సినిమాకు అవార్డు వచ్చింది కదా..! ఈ సినిమాలో వీఎ్‌ఫఎక్స్ ప్రత్యేకతలేమిటి?
ఆ సినిమా మా దగ్గరకు వచ్చే సమయానికి 70 శాతం షూటింగ్ పూర్తయిపోయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు కావాల్సిన అవుట్‌పుట్ గురించి స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఒక టీజర్ తయారుచేశాం. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల్లో ప్రాజెక్టు పట్ల కొత్త క్రేజ్ వచ్చింది. దాంతో మిగిలిన 30 శాతం షూటింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీఎ్‌ఫఎక్స్‌కు అదనపు బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాలో వీఎ్‌ఫఎక్స్ షాట్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. లొకేషన్స్ ఎవరూ ఎప్పుడూ చూడనివే! రంగులు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. మంచి వీఎ్‌ఫఎక్స్ షాట్స్‌కు.. బాగాలేని వీఎ్‌ఫఎక్స్ షాట్స్‌కు తేడా అదే! మేము రూపొందించే షాట్స్ అన్నీ కాంతివంతంగా కనిపిస్తూ ఉంటాయి. వీటినే ప్రేక్షకులు ఇష్టపడతారు. ఉదాహరణకు ‘ఆదిపురు్‌ష’లో వీఎ్‌ఫఎక్స్ షాట్స్ తీసుకుందాం. చీకటిలో కప్పేసినట్లు ఉంటాయి.
వీఎఫ్ఎక్స్ కు విపరీతంగా ఖర్చు అవుతుందా?
చేయాల్సిన పని ఆధారంగా ఉంటుంది. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చాలంటే పెద్ద ఖర్చు కాకపోవచ్చు. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ రూపొందించాలంటే సమయం పడుతుంది. దీనివల్ల ఽఖర్చు పెరుగుతుంది. చేయాల్సిన పని ఎంత సంక్లిష్టంగా ఉంటే ఖర్చు అంత పెరుగుతూ వెళ్తుంది. విజువల్స్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ రావాలంటే, వాటిలో ఉన్న లేయర్స్‌ను కలపాలి. దానిని రెండరింగ్ అంటారు. ఇది ఒక సన్నివేశానికి అరగంట పట్టవచ్చు. సన్నివేశం సంక్లిష్టంగా ఉంటే ఐదు గంటలు కూడా పట్టవచ్చు. దీనివల్ల ఖర్చు పెరుగుతుంది.
ఈ మధ్యకాలంలో ‘బాడీ డబుల్స్’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది..?
ప్రతి సినిమాలో స్టోరీ టెల్లింగ్.. హీరో తీసుకొనే రిస్క్.. చాలా కీలకమైన అంశాలు. ఒక కథలో డబుల్ రోల్ ఉందనుకుందాం. ఒకరు 100 కేజీలు ఉండాలి. మరొకరు 50 కేజీలు ఉండాలి. అది సాధ్యం కాదు కాబట్టి ఒకప్పుడు అలాంటి కథలను ఎంపిక చేసుకొనేవారు కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న అఽత్యాధునిక టెక్నాలజీతో మనిషిలాంటి మనిషిని తయారుచేయవచ్చు. ఇక రెండో విషయం... హీరో తీసుకొనే రిస్క్. ఒకప్పుడు హీరోలు తమ ఫైట్లు తామే చేసుకొనేవారు. డూపులు కూడా తక్కువే! కానీ సినిమా బడ్జెట్ పెరిగిపోయిన తర్వాత హీరోకి దెబ్బ తగిలితే చాలా నష్టం వస్తుంది. అందువల్ల ఎక్కువగా డూపుల చేతే ఫైట్లు చేయిస్తున్నారు. మనకు ప్రస్తుతం డిజిటల్ డబుల్ టెక్నాలజీ.. ఫొటో జామెట్రీ వంటివి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి డూప్‌లు కూడా సహజంగా కనిపించేలా ఉండేలా మార్చేయవచ్చు. ఈ రెండింటివల్ల దర్శకులకు చాలా స్వేచ్ఛ వచ్చింది. సమయం, బడ్జెట్ ఉంటే వారి ఊహల్లో ఉన్న ఎలాంటి కథనైనా ఇప్పుడు సినిమాగా తీసేయవచ్చు.
వీఎఫ్ఎక్స్ లలో ఏఐ వినియోగం ఎక్కడిదాకా వచ్చింది?
ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. కమర్షియల్ స్థాయిలో దీనిని వాడాలంటే మరో నాలుగైదేళ్లు పడుతుంది. అప్పటిదాకా చిన్న చిన్న అంశాలలో దీనిని వాడుకోవచ్చు.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
దేశంలోనే తొలి కంపెనీ...
డిజిటల్ డబుల్ టెక్నాలజీ... మా దగ్గర, షారూక్‌ఖాన్‌కు చెందిన ‘రెడ్ చిల్లీస్’ సంస్థ దగ్గర మాత్రమే ఉంది. మన దగ్గర ఫొటో జామెట్రీ అనే కొత్త టెక్నాలజీ కూడా ఉంది. దీనిలో వంద కెమెరాలు ఉంటాయి. ఒక వ్యక్తిని మధ్యలో కూర్చోబెడితే- అతని మొహంలోని అణువణువూ నమోదు అవుతుంది. ఈ విజువల్స్ ఆధారంగా ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో ఒక మెష్‌ను క్రియేట్ చేస్తాం. దీనిని ఆ తర్వాత మనకు ఎలా కావాల్సి వస్తే అలా వాడుకోవచ్చు. ఇదే విధంగా మన దగ్గర బాడీ మోషన్ కేప్చర్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. చాలా కంపెనీల దగ్గర హార్డ్‌వేర్ ఉంటుంది. కానీ సాఫ్ట్‌వేర్ ప్రొసెసింగ్ కోసం ఇతర కంపెనీల మీద ఆధారపడాలి. మన దగ్గర సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండూ ఉన్నాయి. ఈ తరహా కంపెనీ దేశంలో మరొకటి లేదు.
‘విశ్వంభర’ అద్భుతం...
‘విశ్వంభర’ చిత్రంలో 80 శాతం వీఎ్‌ఫఎక్స్ ఉంటాయి. ‘క్లాష్ ఆఫ్ టైటాన్స్’ వంటి హాలీవుడ్ సినిమాల స్థాయిలో దృశ్యాలు ఉంటాయి. ఇప్పటిదాకా మన దేశంలో ఇలాంటి వీఎ్‌ఫఎక్స్ షాట్స్ ఏ సినిమాల్లోనూ రాలేదు. ఈ సినిమా టీజర్ అవుట్‌పుట్ సరిగ్గా రాలేదు. దానికి సమయాభావమే కారణం. ఆ తర్వాత అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ఈ సినిమా వీఎ్‌ఫఎక్స్ షాట్స్ ‘కల్కి, బాహుబలి’ స్థాయిలో ఉంటాయి. వాటిని మించిపోతాయి కూడా!
అతి పెద్ద ప్రశంస...
మేము రూపొందించిన వీఎ్‌ఫఎక్స్ షాట్స్‌ను ఒకాయనకు మా ఎండీచూపించారు. ఆయన ఆ షాట్స్ చూసి- ‘‘ఈ ప్లేస్‌కు నేను వెళ్లాను. చాలా బాగుంటుంది’’ అన్నారట. మాకు అంతకన్నా పెద్ద ప్రశంస ఏముంటుంది?
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News