Share News

Monsoon makeup: వానల్లో హాయ్‌ హాయ్‌...

ABN , Publish Date - May 31 , 2025 | 02:16 AM

వానల సమయంలో మేకప్ చెదరకుండా ఉండేందుకు మాన్‌సూన్‌ ప్రూఫ్‌ ఉత్పత్తులు, నాణ్యమైన సన్‌స్క్రీన్‌, వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్‌, లాంగ్‌ స్టే లిప్‌స్టిక్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, బ్లాటింగ్‌ పేపర్స్‌, సెట్టింగ్‌ స్ప్రేలు మేకప్‌ను ఎక్కువ సమయం నిలిపి ఉంచేందుకు సహాయపడతాయి.

Monsoon makeup: వానల్లో హాయ్‌ హాయ్‌...

మేకప్‌

వానల్లో వేసుకునే మేకప్‌ తడికి చెదిరిపోకుండా ఉండాలి. అందుకోసం మాన్‌సూన్‌ ప్రూఫ్‌ మేకప్‌ ఎంచుకోవాలి. వాన నీటికి చెక్కుచెదరని ఉత్పత్తులు, మెలకువలు పాటించాలి. అవేంటంటే...

ఇలా సిద్ధం చేయాలి

  • జిడ్డు లేని మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. అప్పుడే తేమతో మేకప్‌ కరిగిపోకుండా, జారిపోకుండా ఉంటుంది.

  • నీటిని తట్టుకునే ప్రైమర్‌ ఉపయోగించాలి. ఇది నున్నని బేస్‌గా మారి, మేక్‌పను ఎక్కువ సమయం పాటు నిలిపి ఉంచుతుంది

  • సన్‌స్ర్కీన్‌ వాడడం ఆపేయకూడదు. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ కోసం సన్‌స్ర్కీన్‌ వాడడం తప్పనిసరి.

ఫౌండేషన్‌ ఇలా...

  • తేలికపాటి బిబి క్రీమ్‌ను ఎంచుకోవచ్చు. భారీగా ఉండే, ఫుల్‌ కవరేజ్‌ ఫౌండేషన్లు ఈ కాలానికి తగినవి కావు. ఇవి అసౌకర్యంగా ఉండడమే కాకుండా, తేమకు కరిగిపోతాయి.

  • మేకప్‌ చెదిరిపోకుండా ఉండడం కోసం, మెరుపు నియంత్రించడం కోసం సెట్టింగ్‌ పౌడర్‌ ఉపయోగించాలి.

  • మ్యాట్‌ ఫినిషింగ్‌ స్ర్పేతో మేకప్‌ ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉంటుంది. అలాగే సహజ సిద్ధమైన మెరుపును అందిస్తుంది.

మేకప్‌

  • కళ్లను తీర్చిదిద్దడం కోసం, కనురెప్పుల చిక్కదనాన్ని పెంచడం కోసం వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్‌, మస్కారాలనే ఎంచుకోవాలి

  • పౌడర్‌ ఆధారిత ఐ షాడో ఎంచుకుంటే, చెదిరిపోకుండా సహజసిద్ధంగా కనిపిస్తుంది.

పెదవుల కోసం

  • మ్యాట్‌ లేదా లాంగ్‌ స్టే లిప్‌స్టిక్‌లు ఈ కాలానికి తగినవి. ఇవి చెదిరిపోకుండా ఉంటాయి.

  • పెదవులు పొడిబారిపోకుండా లిప్‌బామ్‌ వాడుకోవాలి. ప్రత్యేకించి మ్యాట్‌ లిప్‌స్టిక్స్‌ వాడేటప్పుడు ముందుగా లిప్‌ బామ్‌తో పెదవులను మర్దించాలి.

అదనపు చిట్కాలు

  • బ్లాటింగ్‌ పేపర్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి. అదనపు జిడ్డును వదిలించడానికి ఇవెంతో బాగా ఉపకరిస్తాయి.

  • నిద్రకు ముందు మేక్‌పను పూర్తిగా తొలగించుకోవాలి. లేదంటే చర్మ రంథ్రాలు పూడుకుపోతాయి.

  • టచప్స్‌ కోసం వెట్‌ వైప్స్‌ వాడుకోవాలి. వీటిని వాడుకుంటే రోజంతా తాజా అనుభూతి పొందవచ్చు.

  • వాటర్‌ప్రూఫ్‌ సెట్టింగ్‌ స్ర్పే మేక్‌పను సీల్‌ చేసి, ఎక్కువ సమయంపాటు చెదిరిపోకుండా మేక్‌పను కాపాడుతుంది.

Updated Date - May 31 , 2025 | 02:17 AM