వర్షాల్లో కురుల సంరక్షణ ఇలా
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:02 AM
వర్షాకాలం మొదలైపోయింది. వర్షం చినుకుల్లో జుట్టు తడిచిపోతుంటుంది. వర్షపు నీటిలో ఆమ్లత్వం ఉండడం వలన అనేక కేశ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో శిరోజాల రక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...

వర్షాకాలం మొదలైపోయింది. వర్షం చినుకుల్లో జుట్టు తడిచిపోతుంటుంది. వర్షపు నీటిలో ఆమ్లత్వం ఉండడం వలన అనేక కేశ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో శిరోజాల రక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వలన మాడు జిడ్డుగా మారడంతో పాటు కురులు గడ్డిలా మారుతాయి. దీనివలన కేశాలు బలహీనపడి రాలిపోతుంటాయి. కాబట్టి వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి. సల్ఫేట్ లేని షాంపూలు వాడితే జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
వర్షాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది. కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది.
కలబంద గుజ్జును మాడుకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తరువాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్ట రాలడం తగ్గుతుంది.
తడి జుట్టును దువ్వడం వలన కూడా జట్టు రాలుతుంది. కాబట్టి జట్టును ఆరిపోయాక మాత్రమే దువ్వాలి.
కురులను బిగుతుగా కట్టి ఉంచేలా జడలు, ఫోనిటైల్స్ను వేసుకోకూడదు.
వర్షాకాలంలో స్రైట్నర్లు, కర్ల్ ఐరన్లు వంటిని వాడకపోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..
Read latest AP News And Telugu News