Share News

Skincare Tips: కళ్లద్దాల మచ్చలా..

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:06 AM

ఈరోజుల్లో పెద్దలే కాదు చిన్నపిల్లలూ కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది.

Skincare Tips: కళ్లద్దాల మచ్చలా..

ఈరోజుల్లో పెద్దలే కాదు చిన్నపిల్లలూ కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఫ్యాషన్‌ కోసం కూడా కొందరు కళ్లజోడు వాడతారు. అయితే కళ్లజోడు వలన ముక్కు మీద మచ్చలు ఏర్పడుతుంటాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం...

  • కలబందలో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే లక్షణాలు ఉన్నాయి. రాత్రి పడుకొనేముందు కలబంద గుజ్జును కళ్లజోడు వలన కలిగిన మచ్చల మీద రాయాలి. తెల్లారి లేవగానే నీళ్లతో కడిగేయాలి.

  • బంగాళదుంప రసాన్ని మచ్చల మీద రాసి పావుగంట తరువాత కడిగేయాలి. రోజకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

  • ముఖం మీద మచ్చలను తొలగించడంలో కీరదోశ చక్కగా పని చేస్తుంది. కీరదోసను గుండ్రటి ముక్కలుగా కోసి, ముక్కు మీద మచ్చలున్న చోట పెట్టి కొంచెం సేపు రుద్దాలి. తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

  • తేనె చర్మానికి తేమను అందించడంతో పాటు మచ్చలను తగ్గించేందుకు బాగా సహాయపడుతుంది. ఒక స్పూన్‌ తేనెలో ఒక స్పూన్‌ పాలు కలిపి మచ్చల మీద రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి.

  • నారింజ తొక్కను బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొంచెం పాలు పోసి పేస్టులా చేసుకుని మచ్చల మీద రాసి పావుగంట తరువాత చన్నీటితో కడిగేయాలి.

  • గులాబీ నీళ్లను మచ్చల మీద రాసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. రోజూ ఇలా చేసిన మంచి ఫలితముంటుంది.

Updated Date - Jul 12 , 2025 | 12:06 AM