Best Way To Clean Garbage Bin: చెత్త బుట్టను ఇలా ఉంచుకోవాలి...
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:15 AM
చెత్త బుట్టలో ఆహార వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారం వేస్తూ ఉంటాం. వీటివల్ల చెత్త తొలగించినా

చెత్త బుట్టలో ఆహార వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారం వేస్తూ ఉంటాం. వీటివల్ల చెత్త తొలగించినా ఒక్కోసారి బుట్టలో ఈ దుర్వాసన వదలదు. చిన్న చిట్కాలతో దుర్వాసన రాకుండా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
చెత్తను తొలగించిన ప్రతిసారీ... బుట్టను నీళ్లతో శుభ్రంగా కడగాలి. వారానికి ఒకసారి ఖాళీ చెత్త బుట్టలో ఒక చెంచా బ్లీచింగ్ పౌడర్ లేదా కొద్దిగా వెనిగర్ వేసి పొడవాటి బ్రష్‌తో రుద్దాలి. తరవాత వేడినీళ్లు పోసి కడిగి ఎండలో ఆరబెట్టాలి.
శుభ్రం చేసిన చెత్త బుట్టలో అడుగున కొద్దిగా బేకింగ్ సోడా చల్లాలి. దానిమీద మందపాటి పొడవైన కాగితాన్ని పరచాలి. ఈ కాగితం... బుట్ట పై భాగం వరకూ వచ్చేలా అమర్చాలి. దీనివల్ల వ్యర్థ పదార్థాల తేమను కాగితం పీల్చుకుంటుంది. బుట్ట పొడిగా శుభ్రంగా ఉంటుంది.
బుట్టను వంటగదిలో పెట్ట కూడదు. బాల్కనీలో ఓ మూలగా పెట్టాలి. దీనివల్ల వ్యర్థ పదార్థాలు గాలికి ఆరుతూ కుళ్లిపోకుండా ఉంటాయి. బుట్ట నుంచి దుర్వాసన కూడా రాదు.
వాడేసిన నిమ్మ, నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని చెత్త బుట్టలో అడుగున వేసినా మంచి ఫలితం ఉంటుంది.
తడి, పొడి చెత్తలకు వేర్వేరు బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి