Share News

Kusuma Leaf Magic: ఆరోగ్యానికి కుసుమ ఆకుల మందు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:13 AM

కుసుమ ఆకులు వాతవ్యాధులు, మూత్ర సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకు సహాయపడతాయి. ఇవి రక్తశుద్ధి, రోగనిరోధక శక్తి పెంపు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి

Kusuma Leaf Magic: ఆరోగ్యానికి కుసుమ ఆకుల మందు

కుసుమ మొక్కను సంస్కృతంలో ‘కౌసుంభ’ అని పిలుస్తారు. ఇది పొద్దుతిరుగుడు తరహాలో కనిపించే నూనె గింజల మొక్క. అయితే దీని అసలైన విశిష్టత గింజల్లో కన్నా ఆకుల్లో ఎక్కువ కనిపిస్తుంది. కూరలుగా వండుకునేందుకు, ఔషధంగా వినియోగించేందుకు ఇవి శక్తివంతమైనవి. మిగతా నూనె గింజల మొక్కల ఆకులకు వండుకుతినే అవకాశం లేదు. భోజన కుతూహలం గ్రంథంలో ఈ మొక్క ఆకుల్ని, పూలని, నూనెని కూడా ఆహార పదార్థాలుగా వండుకునే విధానాల్ని విడివిడిగా వివరించారు. కుసుమ ఆకులు కొంచెం తీపి, కారం రుచుల్ని కలిగి ఉంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం...

  • కీళ్ల నొప్పులు వంటి వాతవ్యాధులకు కుసుమ ఆకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలోని వేడి లక్షణం శరీరంలోకి కండరాలకు మేలు చేస్తుంది. ఈ ఆకులను తగిన మోతాదులో వాడితే నొప్పుల తీవ్రత తగ్గుతుంది.

  • అతి వేడి కారణంగా మూత్ర విసర్జనలో కలిగే మంట, నొప్పులను ఈ ఆకులు తగ్గిస్తాయి. కుసుమ ఆకులతో చేసిన టీ మూత్రం సులభంగా వెళ్ళిపోవడాన్ని ప్రేరేపిస్తుంది.

  • వాపులపైన ఆకులను నూరి కట్టు వేస్తే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల వాపు, వాత సంబంధిత రుగ్మతలలో ఇది చాలా ఉపయోగపడుతుంది.


  • కుసుమ ఆకులకు కఫహర గుణం ఉంది. . బ్రాంకైటిస్‌, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల్లో ఇవి ఉపశమనం ఇస్తాయి. దగ్గు, ఉబ్బసం వంటి లక్షణాల నివారణకు కూడా ప్రయోజనకరం.

  • ‘భావప్రకాశ’ గ్రంథం ప్రకారం ఈ ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కండరాల కదిలికలను వేగవంతం చేస్తాయి.

  • కుసుమ ఆకుల్లో ఫ్లావనాయిడ్లు, ఫినాలిక్‌ యాసిడ్లు, ల్యూటెయోలిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె జబ్బుల నివారణలో కూడా ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కుసుమ ఆకులు రక్తంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

జాగ్రత్తలు

కుసుమ ఆకులను ఎక్కువగా తినకూడదు. ఇవి ఎక్కువగా తింటే శరీరంలో ఆమ్లతత్వం పెరుగుతుంది. అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది.

-గంగరాజు అరుణాదేవి


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 12:13 AM