Share News

Hostel Preparation Guide: పిల్లలను హాస్టల్‌కు పంపే ముందు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:01 AM

పిల్లలను హాస్టల్‌కు పంపే ముందు, వారిలో క్రమశిక్షణ, స్వయంప్రమేయత, మరియు జాగ్రత్తలతో జీవించే అలవాట్లను పెంపొందించాలి. స్వీయ నిర్వహణ, ఆత్మవిశ్వాసం, ఇతరులతో కలిసిమెలిసి ఉండటం నేర్పించడం చాలా ముఖ్యం.

Hostel Preparation Guide: పిల్లలను హాస్టల్‌కు పంపే ముందు

ఒక్కోసారి పిల్లలను చదువు నిమిత్తం పాఠశాల స్థాయిలోనే హాస్టల్‌కి పంపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు ముందుగానే పిల్లలకు కొన్ని విషయాలను నేర్పించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  • పిల్లలకు బాధ్యతగా వ్యవహరించడం నేర్పించాలి. చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తూ ఉంటే వాళ్లకి పనులు చేయడం అలవాటు అవుతుంది.

  • సమయానుసారం దినచర్య, వ్యాయామం పూర్తిచేసేలా అలవాటు చేయాలి. క్రమశిక్షణతో ఉండడం నేర్పించాలి.

  • పుస్తకాలు సహా దుస్తులు, ఇతర వస్తువులను భద్రపరచుకునే విధానాలు తెలియజెప్పాలి.

  • పిల్లలు కొత్త చోట ఉండడానికి భయపడుతూ ఉంటారు. అలాకాకుండా వారిని వెన్నంటి ప్రోత్సహిస్తే ఎప్పటికప్పుడు ఎలాంటి పరిస్థితులతోనైనా సర్దుకుపోవడాన్ని అలవాటు చేసుకుంటారు.

  • పిల్లలకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎలానో నేర్పించాలి. ఏ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియజెప్పాలి. దీంతో వాళ్లు ఎక్కడైనా ధైర్యంగా ఉండగల్గుతారు.

  • అనుకోకుండా ఏదైనా పొరబాటు జరిగితే దాని నుంచి పాఠం నేర్చుకోవడం ఎలానో వివరించి చెప్పాలి.

  • ఇతరులను గౌరవించడం, స్నేహపూర్వకంగా మాట్లాడడం, సంయమనంతో మెలగడం లాంటివి నేర్పించాలి.

  • పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవడం, ఇచ్చిపుచ్చుకునే విధానాల గురించి వివరించాలి.

  • బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నిర్ణీత సమయంలో హోమ్‌వర్క్‌లు పూర్తి చేయడాన్ని అలవాటు చేయాలి.

  • చిన్న చిన్న ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజెప్పాలి.

  • ఆహారం తీసుకోవడం, ఆటలు ఆడడం, చదువుకోవడం, వ్యక్తిగత శుభ్రత లాంటివి పాటించడంలో నిర్లక్ష్యం వహించకూడదని పిల్లలకు వివరించాలి.


ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం

Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు

Pahalgam Attack: భార్యాపిల్లల కళ్లముందే ఐబీ అధికారిని కాల్చిచంపారు

Updated Date - Apr 24 , 2025 | 12:01 AM