Chill with Mango: ఆమ్ పన్నా కొత్తగా
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:01 AM
వేసవిలో శరీరాన్ని చల్లబరచే స్వాదిష్ట పానీయం 'ఆమ్ పన్నా' తయారీ సులభంగా చేయవచ్చు. మామిడి గుజ్జుతో తయారయ్యే ఈ పానీయం ఆరోగ్యానికి మేలు చేస్తుంది

ప్రస్తుతం మనకు పుల్లని పచ్చి మామిడికాయలు లభ్యమవుతున్నాయి. వీటిలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. వీటితో చేసిన ‘ఆమ్ పన్నా’ తాగితే వేసవి తాపం తీరుతుంది. ఆమ్ పన్నా ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.
తయారీ విధానం
ఒక చెంచా జీలకర్రను తీసుకొని దోరగా వేయించి చల్లార్చాలి. పది పుదీనా ఆకులు, పావు చెంచా మిరియాలు, రెండు చెంచాల బెల్లపు పొడి, తగినంత ఉప్పును ఒక మూకుడులో వేసి వేయించాలి. జీలకర్ర సహా వీటన్నింటినీ మిక్సీలో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.
రెండు మీడియం సైజు మామిడి కాయలను తీసుకొని... వాటిని ప్రెషర్‌కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. ఈ మామిడి కాయల తొక్కలను తీసి లోపల గుజ్జును తీయాలి.
ముందుగా చేసుకున్న పొడిని.. ఈ గుజ్జును.. మిక్సీలో వేసి బాగా తిప్పాలి. దీనిని ఒక కంటైనర్‌లో భద్రపరుచుకోవాలి. ఇది పది రోజుల దాకా పాడుకాదు. కావాలనుకున్నప్పుడు ఈ మిశ్రమాన్ని గ్లాసులో సగం వేసి చల్లటి నీళ్లలో కలుపుకోవాలి. సోడాలో కలుపుకున్నా బాగుంటుంది.
కేవలం మామిడి రుచి మాత్రమే కావాలనుకొనేవారు పుదీనా ఆకులు వేయాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి..