Share News

Chempaswaralu: అదనపు హంగులద్దే చంపస్వరాలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:03 AM

మహిళల అందాన్ని ఇనుమడింపజేయడానికి అనేక ఆభరణాలు ఉన్నాయి. వీటిలో చెంపస్వరాలు ప్రధానమైనవి. ఒకప్పుడు వీటిని సంప్రదాయ నాట్య కళాకారిణులు ధరించేవారు...

Chempaswaralu: అదనపు హంగులద్దే చంపస్వరాలు

సంప్రదాయం

మహిళల అందాన్ని ఇనుమడింపజేయడానికి అనేక ఆభరణాలు ఉన్నాయి. వీటిలో చెంపస్వరాలు ప్రధానమైనవి. ఒకప్పుడు వీటిని సంప్రదాయ నాట్య కళాకారిణులు ధరించేవారు. ఇవి సాధారణంగా చెవి దుద్దుల నుంచి జడను అనుసంధానం చేస్తూ ఉంటాయి. పూర్వం వీటిని చంపక పుష్పం ఆకారంలోనే రూపొందించేవారు. వీటికి ఉండే గొలుసులు కూడా సన్నంగా ఉండేవి. నృత్యం చేసే సమయంలో ఈ గొలుసుల కదలికలు అదనపు ఆకర్షణగా నిలిచేవి. ఆ తరువాతి కాలంలో చెంపస్వరాలు ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చే వారసత్వంగా మారాయి. ఆధునిక జీవనంలో చీరలు ధరించటం తగ్గిన తర్వాత వీటిని ఉపయోగించేవారి సంఖ్య తగ్గింది. కేవలం పండుగల సమయంలో ధరించడానికే పరిమితం అయ్యాయి. కానీ ఈ మధ్యకాలంలో వీటికి ఆదరణ బాగా పెరిగింది. ముఖ్యంగా పెళ్ల్లి సమయంలో చెంపస్వరాలు ధరించని వధువులు ఉండటం లేదు. వధువు అలంకరణలో ఇవి ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం బంగారంతో మాత్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం ముత్యాలు, వజ్రాలు, కెంపులు లాంటి వాటితో కూడా వీటిని రూపొందిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 05:03 AM