లీచీ ఔషధ గుణాలెన్నో
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:41 AM
ఎర్రగా చూడగానే తినేయాలనిపించే లీచీ పండు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ఎర్రగా చూడగానే తినేయాలనిపించే లీచీ పండు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
లీచీల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తికి ఊతమిస్తుంది.
ఈ పళ్లలోని ఫైబర్ అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.
లీచీల్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి డీహైడ్రేషన్ ముప్పు తప్పుతుంది.
లిచి పళ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సమస్యలను ఇది దరిచేరనీయదు.
లీచీల్లో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు నియంత్రణకు ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి.
ఇందులోని టమిన్ సి, యాంటిఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Read latest AP News And Telugu News