గాలి కాలుష్యంతో గర్భిణులకు చేటు
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:54 AM
వెడల్పు పరంగా, మానవ రోమం కంటే 30 రెట్లు సూక్ష్మంగా ఉండే గాలి కలుషితాలకూ, నెలలు నిండకుండా పుట్టే పిల్లలకూ సంబంధం ఉందని పరిశోధకులు ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నారు...

అప్రమత్తం
వెడల్పు పరంగా, మానవ రోమం కంటే 30 రెట్లు సూక్ష్మంగా ఉండే గాలి కలుషితాలకూ, నెలలు నిండకుండా పుట్టే పిల్లలకూ సంబంధం ఉందని పరిశోధకులు ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా అందుకు కారణాలను కనిపెట్టడం జరిగింది. ప్రత్యేకించి ట్రాఫిక్, పరిశ్రమలు, శిలాజ ఇంధనాలను మండించడం, దావానలాల పొగలు, గర్భిణుల రక్తంలోని కణాలను దెబ్బ తీస్తాయనీ, తద్వారా నెలలు నిండకుండా ప్రసవమైపోయే ప్రమాదం ఉంటుందనీ పరిశోధకులు అంటున్నారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, గర్భిణి శరీరం మీద కలుషితాలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయనే దానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 37 వారల కంటే ముందే పుట్టే నెలలు నిండని 10ు పసికందుల పుట్టుక వెనక 2.5 మైక్రోమీటర్ల అణువులు ఉంటున్నట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాల్లో 17ు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలే ఉంటున్నట్టు కూడా వారు పేర్కొంటున్నారు. ఒకవేళ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ప్రాణాలను కాపాడుకోగలిగినా, ఇలాంటి ముందస్తు జననాల కారణంగా పిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ, శ్వాసకోశ సమస్యలు లాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News