Share News

Vice President pension: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:33 AM

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు పెన్షన్ ఎంత ఉండొచ్చన్న చర్చ కూడా మొదలైంది. మరి రాజ్యాంగం ప్రకారం ఆయన జీతభత్యాలు, రిటైర్మెంట్ తరువాత పెన్షన్ ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.

Vice President pension: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా
Vice President pension India

ఇంటర్నెట్ డెస్క్: తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపించినట్టు తెలిపారు. పదవీ కాలం ముగియక మునుపే తప్పుకున్న మూడో ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ నిలిచారు. ఈ నేపథ్యంలో అసలు పదవిలో ఉండగా ఆయన జీతభత్యాలు ఎంత, రిటైర్మెంట్ తరువాత పెన్షన్ ఎంత వస్తుందీ అన్న సందేహాలు జనాలు వెలిబుచ్చుతున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2018 నాటి బడ్జెట్‌లో ఉపరాష్ట్రపతి శాలరీని నెలకు రూ.4 లక్షలుగా నిర్ణయించారు. ఉపరాష్ట్రపతికి నివాసం, ప్రయాణ సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తుంది. వైద్యం కూడా ఉచితమే.

ఇక మాజీ ఉపరాష్ట్రపతి పెన్షన్ ఎంత అన్నది ఆయన పదవీ కాలాన్ని బట్టి ఉంటుంది. మీడియా కథనాల ప్రకారం, శాలరీలో 50 నుంచి 60 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఉపరాష్ట్రపతులకు పెన్షన్‌గా చెల్లిస్తుంది. అయితే, ఇది ఆయన పదవీ కాలాన్ని బట్టి ఉంటుంది. ఈ లెక్కన జగదీప్ ధన్‌ఖడ్‌కు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


పెన్షన్‌తో పాటు అనేక ఇతర సౌకర్యాలు మాజీ ఉపరాష్ట్రపతికి అందుబాటులో ఉంటాయి. వారికి వైద్యం ఉచితం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబసభ్యలకు ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. ప్రభుత్వం మాజీ ఉపరాష్ట్రపతికి నివాస సౌకర్యం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అవసరం మేరకు భద్రతను కూడా కల్పిస్తారు.

ఇక రాజ్యాంగంలోని 91వ అధీకరణ ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన సందర్భాల్లో రాజ్యసభ బాధ్యతను సభ డిప్యుటీ చైర్మన్ నిర్వహిస్తారు. సభ కార్యకలాపాలను ఆయనే పర్యవేక్షిస్తారు. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నియమనిబంధనలను రాజ్యాంగంలోని 63 - 71 అధీకరణల్లో పొందుపరిచారు. దీని ప్రకారం, నూతన ఉపరాష్ట్రపతిని రాబోయే 60 రోజుల్లోపల ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభల సభ్యులు నూతన రాష్ట్రపతిని ప్రపోర్షనల్ రిప్రెజెంటేషన్ విధానంలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నిక తేదీని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది.


ఇవి కూడా చదవండి:

కామిక్స్ పుస్తకాల్లో కొకైన్ స్మగ్లింగ్.. బెంగళూరు ఎయిర్‌‌పోర్టులో నిందితుడి అరెస్టు

నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ.. ఇది సున్నితమైన అంశమని ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 01:02 PM