Share News

Sanchar Saathi App: సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు

ABN , Publish Date - Dec 02 , 2025 | 08:38 AM

దేశంలో వినియోగించే ప్రతి ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఇకపై దేశంలో తయారయ్యే ఫోన్‌లల్లో వీటిని ముందస్తుగా ఇన్‌స్టాల్ చేశాకే విక్రయించాలని ఫోన్ తయారీదార్లు, దిగుమతిదార్లను టెలికాం శాఖ ఆదేశించింది.

Sanchar Saathi App: సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
Sanchar Saathi App - DoT Rules

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇకపై విక్రయించే ప్రతి సెల్ ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ ఉండాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్‌ను కొత్త ఫోన్‌లలో తప్పనిసరిగా డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్‌లల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించి కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోపు సమర్పించాలని తెలిపింది (Sanchar Saathi On all Phones).

అంతేకాకుండా, ఈ యాప్‌ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్‌స్టాల్ చేయాలని కూడా కేంద్రం సూచించింది. మొదటిసారి డివైజ్ సెటప్ సమయంలోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ యాప్‌ పనితీరుకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించొద్దని కూడా తన మార్గదర్శకాల్లో పేర్కొంది. నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా టెలికాం శాఖ చెప్పింది.


ఫోన్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఈ యాప్‌తో వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ ఈఎమ్ఈఐ నెంబర్‌ దుర్వినియోగమైన సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రతి ఫోన్‌కు ఉండే ప్రత్యేక సంఖ్యను ఈఎమ్ఐఈ అంటారన్న విషయం తెలిసిందే. ఫోన్ చోరీలు, ఇతరత్రా మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈఎమ్ఈఐ నెంబర్ దుర్వినియోగంతో పాటు స్పామ్ కాల్స్, మొబైల్ చోరీ అయిన సందర్భాల్లో కూడా జనాలు ఫిర్యాదు చేయొచ్చు.

ఇక వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజ్ యాప్స్‌‌కు కేంద్ర ప్రభుత్వం సిమ్ బైండింగ్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో, నిరంతరం సిమ్ యాక్టివ్‌గా ఉన్న ఫోన్‌లోనే మెసేజింగ్ యాప్స్ వాడటం కుదురుతుంది. సిమ్ తీసేసినా, మరో సిమ్ పెట్టినా లేక సిమ్ డీయాక్టివేట్ అయినా యాప్ ఆగిపోతుంది. ఇక వాట్సాప్ వెబ్‌లో లాగిన్స్ కూడా ప్రతి ఆరుగంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతాయి. యూజర్లు మళ్లీ లాగిన్ చేయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు

సిమ్‌ ఉన్న ఫోన్లోనే వాట్సాప్‌ లాగిన్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2025 | 08:48 AM