Ram Kapoor: నటుడి రోత పుట్టించే డర్టీ కామెంట్లు..గెటౌట్ అయ్యాడు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:46 PM
టీవీ స్టార్ రామ్ కపూర్ వెకిలి మాటలు.. డర్టీ చేష్టలు అతని పరువంతా తీశాయి. దీంతో నటుడు తాను నటించిన జియో హాట్‌స్టార్ సిరీస్ 'మిస్త్రీ' ప్రమోషన్స్‌కు దూరమయ్యాడు. అతని కుళ్లు జోకులు, మహిళా సిబ్బంది మీద అతడి చూపులు డర్టీ పిక్చర్‌ను తలపించాయి.

ఇంటర్నెట్ డెస్క్: టీవీ స్టార్ రామ్ కపూర్ వెకిలి మాటలు.. డర్టీ చేష్టలు అతని పరువంతా తీశాయి. దీంతో నటుడు తాను నటించిన జియో హాట్‌స్టార్ సిరీస్ 'మిస్త్రీ' ప్రమోషన్స్‌కు దూరమయ్యాడు. ఇక మీదట ఆయన ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఇటీవల జరిగిన ఒక ప్రమోషన్ కార్యక్రమంతో పాటు, పలు ఈవెంట్లలో అక్కడున్న ఆడవాళ్ల పట్ల రామ్ కపూర్ లైంగికంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నది ప్రధాన ఆరోపణ. గత వారం ముంబైలో జరిగిన 'బడే అచ్చే లగ్తే హైన్' కార్యక్రమంలో తన సహనటి మోనా సింగ్ సమక్షంలో రామ్ కపూర్ అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సదరు స్ట్రీమర్ యాజమాన్యం రామ్ కపూర్‌ను 'మిస్త్రీ' సిరీస్ ప్రమోషన్ల నుండి దూరంగా ఉంచాలని నిర్ణయించింది. జూన్ 19న జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కూడా రామ్ కపూర్ లైంగిక, అసభ్యకర వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జియో హాట్‌స్టార్ సోర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం రామ్ కపూర్ 'జోకుల' టోన్.. అతడి మాటలు ప్రొఫెషనల్‌గా లేవని అంటున్నారు. ఆ రోజు రామ్ కపూర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో ఒక సమయంలో పని ఒత్తిడిని ప్రస్తావిస్తూ, తాను 'గ్యాంగ్-రేప్' అయినట్లు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో ఒక లేడీ జర్నలిస్ట్ కూడా అక్కడే ఉంది.
అంతేకాదు, అదే రోజు సాయంత్రం కూడా రామ్ కపూర్ జియో హాట్‌స్టార్ పబ్లిక్ రిలేషన్స్ టీం డ్రెస్సింగ్ మీద కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఒక ఉద్యోగిని ధరించిన దుస్తుల పొడవుని ప్రస్తావిస్తూ.. తన చూపు తిప్పేలా చేస్తున్నాయంటూ కామెంట్ చేశాడట రామ్ కపూర్. మరొకామెతో చాలా అభ్యంతరకరమైన కామెంట్లతో జోకులు వేశాడని, లైంగిక భంగిమల గురించి ప్రస్తావించాడని మండిపడుతున్నారు. దీంతో తర్వాతి రోజే(జూన్ 20)న, జియో హాట్‌స్టార్ సీనియర్ మేనేజ్‌మెంట్ రామ్ కపూర్ డర్టీ కామెంట్స్‌పై సీరియస్ అయింది. HR బృందంతో చర్చించి రామ్ కపూర్.. మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లను రద్దు చేసింది.
ఇలా ఉండగా, 'మిస్త్రీ' అనే ఓటీటీ సిరీస్. అమెరికన్ షో మాంక్ ఆధారంగా రూపొందించారు. ఇది అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ ఉన్న ఒక డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ. శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌గా ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో రామ్ కపూర్.. అర్మాన్ మిస్త్రీ పాత్రలో టైటిల్ స్లీత్‌గా నటించారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి
హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్..
For National News And Telugu News