IPS Parag Jain: కొత్త రా చీఫ్‌గా త్వరలో బాధ్యతలు.. ఎవరీ పరాగ్ జైన్?
ABN , Publish Date - Jun 28 , 2025 | 07:36 PM
IPS Parag Jain: ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడ్డ పరిస్థితులను ఎంతో చాకచక్యంగా హ్యాండిల్ చేశారు. శ్రీలంక, కెనడా దేశాల్లో చేపట్టిన భారత దేశానికి సంబంధించిన పలు మిషన్స్‌లో ఆయన సేవలు అందించారు.

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) కొత్త చీఫ్‌గా ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో పరాగ్ జైన్ రా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రవి సిన్హా రా చీఫ్‌గా ఉన్నారు. ఆయన పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రా కొత్త చీఫ్‌గా పరాగ్ జైన్ బాధ్యతలు చేపడతారు. రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు.
ఇంతకీ ఎవరీ పరాగ్ జైన్
పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన దాదాపు 15 ఏళ్ల నుంచి రాలో పని చేస్తున్నారు. రాలో సెకండ్ సీనియర్ మోస్ట్ అధికారి కూడా పరాగ్ జైన్ కావటం విశేషం. ప్రస్తుతం ఆయన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెర్రరిజాన్ని అరికట్టడంలో పరాగ్ పాత్ర ఎంతో ఉంది. ఆపరేషన్ సిందూర్‌లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. పంజాబ్‌లో టెర్రరిజం పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నపుడు ఎంతో నేర్పుతో తన సేవలనందించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడ్డ పరిస్థితులను ఎంతో చాకచక్యంగా హ్యాండిల్ చేశారు. శ్రీలంక, కెనడా దేశాల్లో చేపట్టిన భారత దేశానికి సంబంధించిన పలు మిషన్స్‌లో ఆయన సేవలు అందించారు. కెనడాలో పని చేస్తున్న సమయంలో.. అక్కడినుంచి ఆపరేట్ అవుతున్న ఖలిస్తానీ టెర్రరిస్టు గ్రూపులపై ప్రత్యేక నిఘా ఉంచారు. భారత దేశ నిఘా వ్యవస్థకు ఆయన అందించిన సేవలకు గాను త్వరలో రా చీఫ్‌గా బాధ్యతలు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి