L. K. Advani: 98వ పడిలోకి అద్వానీ.. ప్రముఖుల శుభాకాంక్షలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:13 AM
బీజేపీ సీనియర్ నేత, భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ నేడు 98వ వసంతంలోకి అడుగుపెట్టారు. బీజేపీ అగ్రజునికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె అద్వానీ నేడు 98వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ అగ్రజునికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్ కె అద్వానీని 'అత్యున్నత దృక్పథం కలిగిన రాజనీతిజ్ఞుడు'అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని తన సోషల్ మీడియా సందేశంలో కీర్తించారు.
జాతీయ రాజకీయాల్లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడానికి రూపకర్త అయిన అద్వానీ ఇవాళ (శనివారం) 98 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరమే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్నారని మోదీ గుర్తు చేశారు.
'ఎల్ కె అద్వానీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అత్యున్నత దృక్పథం, అపారమైన తెలివితేటలతో ఆశీర్వదించబడిన రాజనీతిజ్ఞుడు, అద్వానీ జీవితం భారతదేశ పురోగతిని బలోపేతం చేయడానికి అంకితం చేయబడింది. ఆయన నిస్వార్థ కర్తవ్య స్ఫూర్తితో, దృఢమైన సంకల్పంతో మూర్తీభవించారు. ఆయన కృషి భారత ప్రజాస్వామ్య, సాంస్కృతి దృశ్యంపై చెరగని ముద్ర వేసింది. అద్వానీ మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి.’ అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
అటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఎల్ కే అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీతో తనకున్న బంధాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేసుకున్నారు.
బీజేపీ కురువృద్ధునికి దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, రాజకీయనేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
జనసమ్మర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడొద్దు.. సుప్రీం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి