Share News

Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య

ABN , Publish Date - Apr 28 , 2025 | 07:08 PM

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. పద్మ అవార్డు విజేతలంతా కుటుంబ సమేతంగా వచ్చి ఈ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.

Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య
Padma Awards 2025

Padma Awards 2025: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ అవార్డు విజేతలంతా కుటుంబసమేతంగా వచ్చి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురికి ఈ ఏడాది 'పద్మ' అవార్డులు దక్కాయి. వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌, సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్‌ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ, కళారంగంలో మిరియాల అప్పారావుకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రాచార్యకు పద్మశ్రీ పుర్కస్కారాలు అందుకున్నారు.

Balakrishna.jpg

పద్మ అవార్డులు దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో వీటిని ప్రదానం చేస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజా సేవ మొదలైన వివిధ విభాగాలు.. కార్యకలాపాల రంగాలలో ప్రతిభ కనబరచినవారికి ఈ అవార్డులు ఇస్తారు. అసాధారణమైన, విశిష్ట సేవలకు 'పద్మ విభూషణ్'ను ప్రదానం చేస్తారు. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు 'పద్మభూషణ్', ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించిన వారికి 'పద్మశ్రీ' అవార్డులు ప్రదానం. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల విజేతల్ని ప్రకటిస్తారు.

Balakrishna.jpg

2025 సంవత్సరానికిగాను రాష్ట్రపతి 139 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను ఇవాళ ప్రదానం చేశారు. మొత్తంగా 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ పురస్కార గ్రహీతలలో 23 మంది మహిళలు ఉండగా, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ వర్గానికి చెందినవారు. 13 మంది మరణాంతర పురస్కార గ్రహీతలు కూడా ఉన్నారు.


Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..

హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..

ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 08:04 PM