Share News

Mallikarjun Kharge: కష్టపడి పనిచేసినా సీఎంని కాలేకపోయా: ఖర్గే

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:05 AM

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి కష్టపడి పనిచేసినా ముఖ్యమంత్రిని కాలేకపోయానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

Mallikarjun Kharge: కష్టపడి పనిచేసినా సీఎంని కాలేకపోయా: ఖర్గే

బెంగళూరు, జూలై 27: కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయానికి కష్టపడి పనిచేసినా ముఖ్యమంత్రిని కాలేకపోయానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా అయిదేళ్లపాటు శ్రమించానని, అయినా ముఖ్యమంత్రి పదవి దక్కలేదంటూ తన అనుభవాలను పంచుకున్నారు. ఆదివారం విజయపురలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చేందుకు తాను కష్టపడ్డానని, కానీ పార్టీలో కేవలం నాలుగు నెలల ముందే చేరిన ఎస్‌.ఎం.కృష్ణకు పదవి దక్కిందని చెప్పారు.


కర్ణాటక పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎస్‌.ఎం. కృష్ణ ప్రచారం చేయడంతో ఆయనకు పీఠం వరించింది. ఇలాంటి వైఫల్యాలను చూసి మనసులో ద్వేషం పెంచుకోకూడదని, అలా చేస్తే అనుకున్నవి సాధించలేరని అన్నారు. తాను సమితి అధ్యక్షుడి నుంచి ఏఐసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగిన తీరును వివరించారు.

Updated Date - Jul 28 , 2025 | 05:05 AM