Share News

Indian Navy: పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే మిసైల్ ప్రయోగం సక్సెస్

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:07 PM

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తత మధ్య భారత నావికాదళం INS సూరత్ క్షిపణిని పరీక్షించింది. లేటెస్ట్ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఈ క్షిపణి పాక్ వెన్నులో వణుకు..

Indian Navy: పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే మిసైల్ ప్రయోగం సక్సెస్
INS Surat

Indian Navy tests fires INS Surat: భారత నావికాదళం ఇవాళ (గురువారం) తన తాజా స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ INS సూరత్ ను టెస్ట్ ఫైర్ చేసింది. సముద్ర ఉపరితలంపై నుంచి దూసుకెళ్లే తక్కువ ఎత్తులో వెళ్లే వేగవంతమైన క్షిపణి ఇది. ఐఎన్ఎస్ సూరత్ తన లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుని నాశనం చేసిందని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ విజయవంతమైన పరీక్ష భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో మరో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పరీక్ష జరిగింది. సదరు దాడి 26 మంది ప్రాణాలను బలిగొంది. ISI పాక్ సైన్యం ఈ మారణహోమానికి కుట్ర పన్నినట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో తాజా టెస్ట్ ఫైర్ పాకిస్తాన్‌కు ఒక వార్నింగ్ గా ట్రీట్ చేస్తున్నారు.

అంతేకాదు, ఇవాళ లేదా రేపు పాకిస్తాన్ తన కరాచీ తీరప్రాంతం నుండి, దాని ప్రత్యేక ఆర్థిక మండలంలో, ఉపరితలం నుండి ఉపరితలం వరకు క్షిపణి పరీక్షను నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో మన టెస్ట్ ఫైర్ జరగడం విశేషం.

పరీక్షా ప్రయోగం యొక్క వీడియోను పంచుకుంటూ, భారత నావికాదళం.. తాజా స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక INS సూరత్ సముద్ర స్కిమ్మింగ్ లక్ష్యాన్ని విజయవంతంగా నిర్వహించిందని, ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:08 PM