Share News

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఎదురుదెబ్బ..

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:08 PM

మనీలాండరింగ్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో జాక్వెలిన్ క్వాష్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖ‌ర్ నుంచి జాక్వెలిన్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు తేలడంతోనే ఈడీ ఆమెను కూడా విచారిస్తోంది.

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఎదురుదెబ్బ..
Jacqueline Fernandez

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez)ను రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు వెంటాడుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఆమెకు చుక్కెదురైంది. మనీలాండరింగ్ (Money Laundering Case) కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో జాక్వెలిన్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్ట్ ఆ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్థిక నేర‌స్థుడు సుకేశ్ చంద్రశేఖ‌ర్‌ (Sukesh Chandrasekhar)ను మనీలాండరింగ్ కేసులో విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED).. ఆ ఛార్జిషీట్‌లో జాక్వెలిన్ పేరునూ చేర్చి విచారించింది.


మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖ‌ర్ నుంచి జాక్వెలిన్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు తేలడంతోనే ఈడీ ఆమెను కూడా విచారిస్తోంది. అయితే సుకేశ్ మనీలాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తనకు తెలియదని జాక్వెలిన్ వాదిస్తోంది. కాబట్టి, ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జిషీట్‌, ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విచారణలను రద్దు చేయాలని జాక్వెలిన్ కోరింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఏప్రిల్‌లో తన తీర్పును రిజర్వ్ చేసింది.


ఈరోజు వెలువరించిన తీర్పులో జాక్వెలిన్ క్యాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ జీవిత భాగస్వాములను మోసం చేశాడనే ఆరోపణలపై సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. సుకేశ్, అతని భార్య లీనా పౌలోస్ హవాలా మార్గాలను ఉపయోగించారని, మోసం ద్వారా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి ఇతర నిందితులతో కలిసి షెల్ కంపెనీలను సృష్టించారని ఈడీ ఆరోపిస్తోంది.


ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్


రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 05:32 AM