Dharmendra Family Tree:19 ఏళ్లకే మొదటి పెళ్లి.. 13 మంది మనవళ్లు, మనవరాళ్లు .. ధర్మేంద్ర ఫ్యామిలీ ట్రీ ఇదే..
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:03 PM
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర సినిమాల్లోకి రాకముందే వివాహం చేసుకున్నారు. 19 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి జరిగింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమామాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ముంబై, నవంబర్ 24: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఈ రోజు(సోమవారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ధర్మేంద్రకు నివాళులు అర్పించారు. కడసారి వీడ్కోలు చెప్పారు.
19 ఏళ్లకే మొదటి పెళ్లి..
ధర్మేంద్ర చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందే ప్రకాష్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు మాత్రమే. 1954లో పెళ్లి జరిగింది. ఇద్దరు కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇద్దరు కూతుళ్లు విజేత, అజీత జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమామాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈషా డియోల్, అహానా డియోల్ జన్మించారు. సన్ని డియోల్ బాలీవుడ్‌లో హీరోగా సినిమాలు చేస్తున్నారు.
బాబీ డియోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తున్నారు. కూతురు ఈషా డియోల్ కూడా హీరోయిన్‌గా పలు సినిమాలు చేశారు. అహానా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ధర్మేంద్ర మొదటి భార్య పెద్ద కూతురు అజీత డియోల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. టీచింగ్ ఫీల్డ్ ఎంచుకున్నారు. చిన్న కూతురు విజేత కూడా భర్త వివేక్ గిల్ కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ధర్మేంద్రకు ఆరుగురు కొడుకులు, కూతుళ్లు కాగా.. 13 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
మహిళా స్వయం సహాయక సంఘాలకు సర్కార్ గుడ్ న్యూస్
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి