Bahubali Leader Anant Singh: మర్డర్ కేసులో జైల్లో.. అయినా ఎన్నికల్లో గెలిచిన బాహుబలి నేత..
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:49 AM
బిహార్ బాహుబలి నేత అనంత్ కుమార్ సింగ్ ఓ మర్డర్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నా కూడా ఆయనే అత్యధిక మెజార్టీతో మొకామా నుంచి విజయం సాధించారు.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి కూటమిని అథ:పాతాళానికి తొక్కేసింది. ఎన్డీఏ కూటమి ఏకంగా 202 సీట్లను గెలుచుకుంది. మహా ఘట్ బంధన్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇందులో కాంగ్రెస్ 6 సీట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజీపీ ఏకంగా 89 స్థానాల్లో ఘన విజయం సాధించింది. జేడీయూ 85 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసిన వారంతా భారీ మెజార్టీతో గెలిచిన వారే కావటం విశేషం.
జైల్లో ఉన్నా గెలిచిన బాహుబలి నేత..
బిహార్ ఎన్నికల్లో వింత విచిత్రమైన సంఘటనలు చాలా జరిగాయి. జేడీయూ నుంచి బాహుబలి నేత అనంత్ సింగ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మొకామా నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆర్జేడీ నుంచి మహిళా నేత వీనా దేవి ఎన్నికల బరిలో నిలిచారు. వార్ వన్ సైడ్ అయిపోయింది. అనంత్ సింగ్ భారీ మెజార్టీతో గెలిచారు. 91 వేల ఓట్లు సాధించారు. వీనా దేవికి కేవలం 63 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అనంత్ 28 వేల మెజార్టీతో గెలుపు సాధించారు. అనంత్ కుమార్ సింగ్‌పై ఇప్పటి వరకు 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
అక్రమ ఆయుధాల కేసు కారణంగా 2022లో అసెంబ్లీ మెంబర్‌షిప్‌ను కోల్పోయారు. నవంబర్ 2వ తేదీన దులర్ సింగ్ యాదవ్ అనే పొలిటికల్ లీడర్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ ‘జేఎస్‌పీ’ తరఫున ప్రియదర్శి పియూస్ ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్రియదర్శి కోసం దులర్ సింగ్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం సందర్భంగా అనంత్ కుమార్ సింగ్ అనుచరులు దులర్ సింగ్‌పై కాల్పులు జరిపారు. బుల్లెట్ దులర్ కాలిలో దిగబడింది. కాలి గాయం కారణంగా దులర్ గుండె పోటుకు గురై చనిపోయారు. ఈ మర్డర్ కేసులో అనంత్ జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నా కూడా ఆయనే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిచారు.
ఇవి కూడా చదవండి
ఫరీదాబాద్ భారీ పేలుడు ఘటనపై స్పందించి జమ్ము కాశ్మీర్ డీజీపీ
డయాబెటిస్ వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయా?