Air India: ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.. టేకాఫ్ నిలిపివేత..
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:26 PM
దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్లు టేకాఫ్‌ను నిలిపివేశారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్లు టేకాఫ్‌ను నిలిపివేశారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. AI2017 ఎయిరిండియా విమానంలో టెక్నికల్ ఎర్రర్ అనే అనుమానంతో సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేసి, ప్రామాణిక విధానాలను అనుసరించి ముందు జాగ్రత్త తనిఖీలు నిర్వహించారు (Delhi-London flight).
'జూలై 31న ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన AI2017 విమానంలో సాంకేతిక సమస్య ఉందనే అనుమానం రావడంతో కాక్‌పిట్ సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేశారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి ముందు జాగ్రత్త తనిఖీల కోసం విమానాన్ని తిరిగి తీసుకువచ్చారు` అని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. అలాగే ప్రయాణికులను వీలైనంత త్వరగా లండన్‌కు తరలించేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
ఈ ఆలస్యం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు అన్ని రకాల మద్దతును, సంరక్షణను అందిస్తున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రయాణీకుల భద్రత, శ్రేయస్సు తమకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విమానాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి