Air India: ఢిల్లీ ఎయిర్‌పోర్టు టీ2 టర్మినల్ నుంచి ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్‌ల రాకపోకలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:41 PM
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఒకటవ అకెంతో మొదలయ్యే సుమారు 60 డొమెస్టిక్ ఫ్లైట్లు ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్-2 నుంచి రాకపోకలు సాగిస్తాయని తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్మినల్ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తన టర్మినల్ ప్లాన్‌లో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన 60 డొమెస్టిక్ ఫ్లైట్స్ రాకపోకలు మూడవ టర్మినల్‌కు బదులు రెండవ టర్మినల్ నుంచి జరుగుతాయని తెలిపింది. విగతా డొమెట్సిక్ ఫ్లైట్స్ యథావిధిగా టర్మినల్-3 నుంచి రాకపోకలు నిర్వహిస్తాయని పేర్కొంది. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎప్పటిలాగే మూడవ టర్మినల్ నుంచి బయలుదేరతాయి. మూడో టర్మినల్ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎయిర్ ఇండియా ఈ మార్పులు చేసింది. టర్మినల్స్ మధ్య రాకపోకల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, ఒకటితో మొదలయ్యే(ఉదాహరణకు AI-1797) నెంబర్లు ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్స్ రాకపోకలు టర్మినల్-2 నుంచి జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి బగ్గీ రైడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక నిర్వహణ పనుల కారణంగా రెండవ టర్మినల్‌లో తాత్కాలికంగా నిలిచిపోయిన కార్యకలాపాలు నేటి నుంచి మొదలయ్యాయి. దీంతో, అన్ని టర్మినల్స్ అందుబాటులోకి వచ్చినట్టైంది. ఈ మేరకు ఫ్లైట్ నెంబర్స్ ప్లాన్‌లో కూడా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు మరింత సరళతరం చేసేందుకు, ప్రయాణికులకు జర్నీలు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ మార్పులు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌తో 1500 కోట్ల నష్టం.. హైదరాబాద్‌లో భారీగా బాధితులు!
విమానాల్లో పవర్‌బ్యాంకులతో ముప్పు.. కఠిన నిబంధనలు విధించే యోచనలో డీజీసీఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి