PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. లిస్ట్‌లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి..
ABN , Publish Date - May 28 , 2025 | 09:52 PM
PM Kisan Yojana: పీఎం కిషాన్ యోజన పథకం 19వ విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. 20వ విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిషాన్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతీ ఏటా మూడు సార్లు.. 2 వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. ఇక, పీఎం కిషాన్ యోజన 20వ విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి. జూన్ నెలలో డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. 19వ విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
పీఎం కిషాన్ యోజన 20వ విడతకు సంబంధించి అర్హులైన రైతుల లిస్టు ఇప్పటికే విడుదల అయింది. లిస్టులో పేరు ఉన్న వారి ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు పడనున్నాయి. ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ విధంగా చేయండి.
1) మొదటగా మీరు పీఎం కిషాన్ యోజన అఫిషియల్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి
2) అక్కడ ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
3) అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి
4) అక్కడ మీ జిల్లా పేరు, గ్రామం పేరు తదితర వివరాలు ఇవ్వాలి.
5) మీరు ఇచ్చిన సమాచారం సరైనదా కాదా అని చెక్ చేసుకోని, గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి.
6) అప్పుడు రిపోర్టు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
లిస్టులో మీ పేరు లేకపోతే ఎక్కడో తప్పు జరిగిందని గుర్తించాలి.
ఈ తప్పులు చేస్తే డబ్బులు పడవు..
మీరు గనుక మీ ఆధార్ కార్డు నెంబర్‌ను గానీ, మొబైల్ నెంబర్‌ను గానీ పథకానికి లింక్ చేయకపోయి ఉంటే డబ్బులు పడవు. ఒక వేళ మీ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటే.. పథకానికి సంబంధించిన వివరాలు మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి. ఆధార్ లింక్ చేయటం అన్నది కూడా కేవైసీకి చాలా అవసరం. వీటితో పాటు రైతు తన పొలానికి సంబంధించిన వివరాలు తప్పుగా ఇచ్చినా కూడా డబ్బులు పడవు.
ఇవి కూడా చదవండి
సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా.. నిందితుల్లో నర్సులు, వ్యాపారులు..
భర్త సర్‌ప్రైజ్.. భార్య ఎమోషనల్