Vastu Tips For CCTV Camera: మీ ఇంట్లో సీసీ కెమెరా ఉందా.. ఈ దిశలో ఉంటే జాగ్రత్త!
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:59 AM
ఇంటి భద్రత కోసం చాలా మంది ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటారు. మీ ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉందా? అయితే, వాస్తు ప్రకారం ఏ దిశలో సీసీ కెమెరాలు పెట్టడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఈ సైన్స్ యుగంలో కూడా జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం, హస్తసాముద్రికం వంటి పురాతన గ్రంథాలపై ప్రజలకు నమ్మకం తగ్గడం లేదు. చాలా మంది ఇప్పటికీ కూడా వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు. వాస్తు నియమాలు అనుసరించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు.
చాలా వరకు ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వాషింగ్ మిషెన్, గ్యాస్ ఇలా దాదాపు అన్ని వస్తువులకు కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అయితే, ఇంట్లో పెట్టుకునే సీసీటీవీ కెమెరాలకు కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? వాస్తు ప్రకారం ఇంట్లో సీసీ కెమెరాలు ఏ దిశలో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
సీసీ కెమెరా ఈ దిశలో ఉంచకూడదు
నేటి ఆధునిక యుగంలో, ప్రజలు తమ భద్రత కోసం తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, ఇంట్లో సీసీటీవీ కెమెరాను తప్పు దిశలో ఏర్పాటు చేస్తే ప్రతికూల సమస్యలు తప్పవని చాలా మందికి తెలియదు. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. తూర్పు, ఆగ్నేయం, నైరుతి, పశ్చిమ-వాయువ్య దిశలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి కలుగుతుంది. అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ దిశలలో సీసీటీవీ కెమెరాలు మాత్రమే కాకుండా, వారి పిల్లల ఫోటోలు లేదా గడియారాలు కూడా ఉంచకూడదు.
ఏ దిశలో ఉంచాలి?
వాస్తు శాస్త్ర ప్రకారం, సీసీటీవీ కెమెరాలను ఇంట్లో ఏర్పాటు చేసేటప్పుడు ఈశాన్యం వైపు పెడితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సానూకుల శక్తి కలుగుతుందని లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే)
Also Read:
భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!
8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..
For More Lifestyle News