Share News

Bath Tips: సోమవారం నుంచి ఆదివారం వరకూ.. రోజు ఇలా స్నానం చేస్తే అదృష్టం వెంటాడుతుంది..!

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:42 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వారంలోని ఏడు రోజులు నీళ్లలో ఈ వస్తువులు కలిపి స్నానం చేస్తే అదృష్టం వెంటాడుతుంది. ఇలా స్నానం చేయడం వల్ల మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, సోమవారం నుంచి ఆదివారం వరకూ నీటిలో ఏ వస్తువులను కలిపి స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Bath Tips: సోమవారం నుంచి ఆదివారం వరకూ.. రోజు ఇలా స్నానం చేస్తే  అదృష్టం వెంటాడుతుంది..!
Bath

Vastu Tips For Bath: జ్యోతిష్య శాస్త్రంలో జీవితానికి సంబంధించిన ప్రతి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ రోజు బట్టలు ఉతకాలి? ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలి? ఏ రోజు అప్పు తీసుకోకూడదు ఇలా ప్రతి దానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అయితే, స్నానం చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? వారంలోని ఏడు రోజులు నీళ్లలో ఈ వస్తువులు కలిపి స్నానం చేస్తే అదృష్టం వెంటాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా స్నానం చేస్తే జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని అంటున్నారు. అయితే, సోమవారం నుంచి ఆదివారం వరకూ నీటిలో ఏ వస్తువులను కలిపి స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


సోమవారం - పచ్చి పాలు

సోమవారం నాడు నీటిలో పచ్చి పాలు కలిపి స్నానం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. సోమవారం నాడు నీటిలో పచ్చి పాలు కలిపి స్నానం చేయడం వల్ల చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చని, మానసిక ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రంలో సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు, కాబట్టి పాలతో స్నానం చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం పొందవచ్చని భావిస్తారు.


మంగళవారం - ఉప్పు

మంగళవారాల్లో నీటిలో ఒక చెంచా ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మంగళవారం నాడు స్నానం చేసే నీటిలో ఒక చెంచా ఉప్పు కలుపుకోవడం వల్ల శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతిని చేకూరుస్తుందని కూడా భావిస్తారు. పురాతన కాలం నుండి, ఉప్పుతో స్నానం చేయడం అనేది ఒక సాంప్రదాయ ఆచారం. ఇది శరీరాన్ని శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది.

బుధవారం - ఏలకులు

బుధవారం నాడు నీటిలో ఏలకులు వేసి స్నానం చేయడం వల్ల చెడు రోజులు తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయని కొందరు నమ్ముతారు.


గురువారం - పసుపు

గురువారం నాడు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మీ దురదృష్టం తగ్గుతుంది. నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వలన బృహస్పతి గ్రహం బలపడుతుంది. సంపద, అదృష్టం వస్తాయని అని నమ్ముతారు. ఈ పరిహారం జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారికి, కెరీర్ లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారికి మంచిదని భావిస్తారు. అలాగే, పసుపు నీటితో స్నానం చేయడం వలన చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

శుక్రవారం - రోజ్ వాటర్

శుక్రవారం నాడు నీటిలో రోజ్ వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల జీవితంలో ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్ కలపడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇది ప్రేమ, అందం, సంపదలను ఆకర్షిస్తుందని కొందరు భావిస్తారు. అలాగే రోజ్ వాటర్ చర్మానికి కూడా మేలు చేస్తుందని, చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచుతుందని చెబుతారు.


శనివారం - ఆవనూనె

శనివారం నీటిలో ఆవనూనె కలిపి స్నానం చేయడం వల్ల శనిగ్రహ దుష్ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆదివారం - గంగాజలం

ఆదివారం నాడు గంగాజలం నీటిలో కలిపి స్నానం చేయడం అనేది ఒక పవిత్రమైన ఆచారం. గంగా నదిలో స్నానం చేయడం సాధ్యం కాని వారు, ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తారు. ఇలా చేయడం వలన పాపాలు తొలగి మనస్సు, శరీరం శుద్ధి అవుతాయని నమ్మకం.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. జాగ్రత్త.. మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు..!

For More Lifestyle News

Updated Date - Jul 09 , 2025 | 01:00 PM