Visa Approvals: భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో తెలుసా
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:46 PM
భారతీయులు అనేక మంది ఇటీవల కాలంలో ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి భారతీయ టూరిస్టులకు అత్యధికంగా వీసాలు జారీ చేసిన దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఐరోపా దేశాలు స్వర్గధామం అని చెప్పక తప్పదు. శతాబ్దాల నాటి కోటలు, బీచ్‌లు, గులక రాళ్లతో ఉన్న వీధులు.. ఇలా ముచ్చట గొలిపే దృశ్యాలు అనేకం ఐరోపాలో కనిపిస్తాయి. అందుకే, ఏటా అనేక మంది భారతీయ పర్యాటకులు ఐరోపా దేశాలు చుట్టొచ్చేందుకు ఉత్సాహం చూపుతుంటారు. 2024లో భారత్ నుంచి ఏకంగా 1.1 మిలియన్ షెంజెన్ వీసా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఏయే ఐరోపా దేశాలు భారతీయులకు త్వరగా వీసాలు ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
యూరోపియన్ కమిషన్ డేటా ప్రకారం, స్విట్జర్‌లాండ్ గతేడాది భారత పర్యాటకులకు అత్యధికంగా 2 లక్షల వీసాలు జారీ చేసింది. ఇక్కడ భారతీయుల వీసా దరఖాస్తులు ఆమోదం పొందే అవకాశం 97.94 శాతంగా ఉంది.
ఫ్రాన్స్ భారతీయులకు 165,564 వీసాలు జారీ చేసింది. దరఖాస్తు అప్రూవల్ రేటు 83.63 శాతంగా ఉంది.
జర్మనీ వీసా దరఖాస్తుల అప్రూవల్ రేటింగ్ 88.70 శాతంగా ఉంది. గతేడాది భారతీయులకు 126,182 వీసాలు జారీ అయ్యాయి.
స్పెయిన్‌లో భారతీయుల వీసా దరఖాస్తుల అప్రూవల్ రేటు 83.13 శాతం. గతేడాది 80,806 వీసాలను స్పెయిన్ ప్రభుత్వం భారతీయులకు జారీ చేసింది.
నెదర్‌లాండ్స్ వీసా అప్రూవల్ రేటు 83.12 శాతంగా ఉంది. భారతీయ టూరిస్టులకు మొత్తం 75 వేల వీసాలను నెదర్‌లాండ్స్ జారీ చేసింది.
ఇటలీలో వీసా దరఖాస్తుల అప్రూవల్ శాతం 88.69గా ఉంది. గతేడాది మొత్తం 53,539 వీసాలు భారతీయ టూరిస్టులకు జారీ అయ్యాయి.
ఇక ఆస్ట్రియాలో వీసా అప్రూవల్ రేట్ 77.9 శాతం. గతేడాది సుమారు 34 వేల వీసాలు భారతీయ పర్యాటకులకు జారీ అయ్యాయి.
బెల్జియంలో వీసా దరఖాస్తు అప్రూవల్ రేట్లు 90 శాతం కాగా మొత్తం 26,556 వీసాలు జారీ అయ్యాయి.
గ్రీస్ భారతీయులకు గతేడాది 28,230 వీసాలు జారీ చేసింది. వీసా దరఖాస్తుల అప్రూవల్ రేటు 68.15 శాతం. ఇక స్వీడెన్‌లో 28,109 వీసాలు జారీ చేసింది. ఇక్కడ వీసా అప్రూవల్ రేటు 85.33 శాతం.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
సెవెన్ సిస్టర్స్ అద్భుతాల్ని తరిస్తారా.. లక్కీ ఛాన్స్
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి