Thailand Cambodia Safety: థాయ్‌లాండ్, కంబోడియా మధ్య యుద్ధం.. ఈ ఏరియాలకు అస్సలు వెళ్లకండి..
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:26 PM
Thailand Cambodia Safety: భారతీయులు ఎక్కువగా థాయ్‌లాండ్ వెళుతూ ఉంటారు. అయితే, కంబోడియాతో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న కారణంగా థాయ్‌లాండ్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించటం సురక్షితం కాదని అక్కడి ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబీసీలు సైతం ప్రకటనలు విడుదల చేశాయి. ఇక, భారతీయులు కంబోడియా కంటే.. థాయ్‌లాండ్‌కే ఎక్కువగా వెళుతూ ఉంటారు. మీరు కనుక థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటే కొన్ని ఏరియాలకు వెళ్లకుంటే మంచిది. అవేంటో తెలుసుకుందాం..
థాయ్‌లాండ్‌లో వెళ్లకూడని ఏరియాలు..
ఉబోన్ రట్చతాని (Ubon Ratchathani):
ఫూ చాంగ్-నా యోయ్ నేషనల్ పార్క్
కేంగ్ లమ్‌దువాన్
చాంగ్ అన్ మా చెక్‌పాయింట్
సురిన్ (Surin):
ప్రసాత్ టా ముయెన్ తోమ్ / టాడ్
ప్రసాత్ టా క్వై
ప్రసాత్ బాన్ ప్లుయాంగ్
ప్రసాత్ ఫుమ్ పోన్
చాంగ్ చోమ్ చెక్‌పాయింట్
ఫనమ్ స్వాయి ఫారెస్ట్ పార్క్
ఫనమ్ డాంగ్ రాక్ సరిహద్దు ప్రాంతాలు
సీసకెట్ (Sisaket):
ఖావ్ ఫ్రా విహాన్ నేషనల్ పార్క్
చాంగ్ సా-న్గామ్ చెక్‌పాయింట్
కాన్తరలాక్, ఫూ సింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు
బురిరామ్ (Buriram):
చాంగ్ సాయ్ తాకు
టా ప్రయా నేషనల్ పార్క్
బాన్ క్రాట్, లహాన్ సాయి సమీప సరిహద్దు ప్రాంతాలు
సా కేయో (Sa Kaeo):
బాన్ ఖ్లాంగ్ లుయెక్ చెక్‌పాయింట్ , రాంగ్ క్లుయా మార్కెట్
ప్రసాత్ స్డోక్ కోక్ థోమ్
అరన్యప్రతేత్ , ఖ్లాంగ్ హాట్ సమీప సరిహద్దు ప్రాంతాలు
చాంతబురి (Chanthaburi):
బాన్ లేమ్ , బాన్ ఫాట్ కాడ్ చెక్‌పాయింట్లు
పాంగ్ నామ్ రోన్ , సోయ్ డావ్ సమీప సరిహద్దు ప్రాంతాలు
త్రాట్ (Trat):
బాన్ హాట్ లెక్
బాన్ ముయెన్ డాన్, బాన్ మా ముయాంగ్ చెక్‌పాయింట్లు
ఇవి కూడా చదవండి
ఇండియన్ ట్రావెలర్స్‌కు అలర్ట్.. ఈ మార్పులు గురించి తప్పక తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్ర్కీన్ టైం తగ్గించుకోకపోతే ఈ చర్మ సమస్యలు..!