Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడాల్సిన అవసరం లేదు.. ఇలా చేయండి.!
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:18 PM
విదేశాల్లో మీ పాస్ పోర్ట్ పోయిందా? ఒక్క కాపీ కూడా లేదా? అయితే, భయపడాల్సిన అవసరం లేదు .. పాస్‌పోర్ట్ పోగొట్టకుని కనీసం ఏ కాపీ లేకపోయినా మీ పాస్‌పోర్ట్‌ను ఇలా సులభంగా పొందవచ్చని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ (Passport) చాలా ముఖ్యం. ఇది మీ జాతీయతను నిరూపిస్తుంది. విదేశాలలో మిమ్మల్ని రక్షించడానికి, వివిధ దేశాలలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇది తప్పనిసరి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, వివిధ దేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ చాలా అవసరం.
అలాంటి పాస్‌పోర్ట్ విదేశాల్లో ట్రావెల్ చేస్తున్న సమయంలో మిస్ అయితే ఏ భారతీయుడికైనా ఎంతో టెన్షన్‌గా ఉంటుంది. స్వదేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా పాస్‌పోర్ట్ మిస్ అయితే, భయంతో ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే, పాస్‌పోర్ట్ లేకుండా విదేశాలలో ప్రయాణించడం చాలా కష్టం, అంతేకాకుండా భారతదేశానికి తిరిగి రావడం కూడా ఇబ్బంది. అయితే, విదేశాల్లో మీ పాస్ పోర్ట్ పోయినా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు .. మీ పాస్‌పోర్ట్‌ను ఇలా సులభంగా పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
స్థానిక పోలీసులకు ఫిర్యాదు
మీ పాస్‌పోర్ట్ పోయినప్పుడు, వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. తద్వారా మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా విదేశాలలో ఉన్నప్పుడు, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ఈ ఫిర్యాదు నివేదిక ఉపయోగపడుతుంది. కాబట్టి, తప్పనిసరిగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.
కాన్సులేట్‌ను సంప్రదించండి
పోలీసు నివేదిక తీసుకున్న తర్వాత, తదుపరి ప్రక్రియ కోసం భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి. వారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని, తదుపరి ఏం చేయాలో వివరంగా చెబుతారు. ఒకవేళ మీరు ఇతర అత్యవసర కారణం వల్ల భారతదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తే, రాయబార కార్యాలయం అత్యవసర ధృవీకరణ పత్రం (EC) జారీ చేయవచ్చు. ఇది మీరు భారతదేశానికి తిరిగి వెళ్లడానికి మాత్రమే అనుమతించే వన్-వే ప్రయాణ పత్రం, కానీ మీరు మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలకు దీనిని ఉపయోగించలేరు.
కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు
మీరు వెంటనే భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకపోతే, మీ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం మీ గుర్తింపు పత్రాలు, పోలీస్ నివేదిక, ఫొటోలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ పత్రాలు సరిగ్గా ఉంటే, కొత్త పాస్ పోర్ట్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
Also Read:
ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?
స్మృతి కోసం బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్పందించిన సునీల్ శెట్టి
For More Latest News