Airport Mistakes to Avoid: విమాన ప్రయాణం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:06 PM
చాలా మంది విమాన ప్రయాణికులు అనుకోకుండా చేసే తప్పుల వల్ల వారి మొత్తం ప్రయాణం నాశనమవుతుంది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం..
ఇంటర్నెట్ డెస్క్: దూర ప్రాంతాలకు త్వరగా వెళ్లాలంటే విమాన ప్రయాణం కంటే మంచి మార్గం లేదు. చాలా తక్కువ సమయంలోనే చాలా దూరం సులభంగా చేరుకోవచ్చు. అయితే, చాలా మంది ప్రయాణికులు అనుకోకుండా చేసే కొన్ని తప్పుల వల్ల వారి మొత్తం ప్రయాణం నాశనమవుతుంది. అందువల్ల, విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
ఈ తప్పులు అస్సలు చేయకండి
విమానంలో ప్రయాణించాలనుకుంటే ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా వెళ్లకండి. విమానానికి గంట ముందు వచ్చినా సరిపోతుందనుకుని చాలా మంది విమానం మిస్ అవుతారు. దేశీయ ప్రయాణం చేస్తున్నట్లయితే కనీసం 2 గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణమైతే కనీసం 3 గంటల ముందు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి. ఎందుకంటే, ట్రాఫిక్, భద్రతా లైన్లు, పార్కింగ్ ఇవన్నీ టైమ్ తీసుకుంటాయి.
ఆన్‌లైన్ చెక్-ఇన్ తప్పక చేయండి. ఎందుకంటే, ఎయిర్‌లైన్ చెక్-ఇన్ కౌంటర్లు 60 నిమిషాల ముందు మూసేస్తారు. ఆన్‌లైన్ చెక్-ఇన్ చేస్తే లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. టికెట్‌లో పేరు, పాస్‌పోర్ట్‌లోని పేరు ఒకటే ఉండేలా చూసుకోండి.
మద్యం మత్తులో ఎయిర్‌పోర్టుకు వెళ్లకండి. మీరు మత్తులో ఉన్నట్టు కనిపించినా, బాగా అనారోగ్యంగా ఉన్నా విమానంలో ఎక్కనివ్వరు. అలాగే, సిబ్బందిపై కోపం లేదా గొడవపడ్డా బోర్డింగ్ రద్దు చేస్తారు.
మీ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేయండి. కొన్నిసార్లు ఆన్‌లైన్ బుకింగ్ పేమెంట్ విఫలమై ఉంటుంది కానీ మనం బుక్ అయిందనుకుంటాం. విమానానికి 24 గంటల ముందు బుకింగ్ స్టేటస్ చెక్ చేయండి.
ఫోన్‌ను ఆఫ్‌లో పెట్టకండి. విమాన ఆలస్యాలు, గేట్ మార్పులు, బోర్డింగ్ టైమింగ్ అన్ని అప్‌డెట్స్ మొబైల్‌కి వస్తాయి. అందువల్ల, ఫోన్‌లో డేటా ఆన్‌లో ఉంచుకోండి. చార్జింగ్ ఉండేలా, నోటిఫికేషన్లు ఆన్‌లో ఉండేలా చూసుకోండి.
ఇవి కూడా చదవండి:
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా
టూర్‌లపై వెళ్లే వారు తమ సూట్‌కేసుల్లో పెట్టకూడని వస్తువులు ఇవీ